How to organize laptop files easily: రోజూ మనం వాడే ల్యాప్ టాప్ లేదా పీసీలో ఫైల్స్ పేరుకు పోవడం చాలా కామన్. కొత్తగా ఏదైనా డౌన్ లోడ్ చేసినా, ప్రాజెక్ట్ సేవ్ చేసినా.. అదంతా నేరుగా డెస్క్ టాప్ మీదే వచ్చి పడుతుంది. అలా రోజు రోజుకూ.. ఫైల్స్ పెరిగిపోయి, స్క్రీన్ మీద ఐకాన్లు ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. దీంతో.. అర్జెంట్‌గా ఒక ఫైల్ వెతకాలంటే.. నిమిషాల తరబడి వెతకాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్‌కి ఎండ్ కార్డ్ వేయడానికి కొన్ని సూపర్ టెక్నిక్స్, ఆటోమేటిక్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మీ ల్యాప్ టాప్ డెస్క్ టాప్‌పై ఉన్న గజిబిజిని తొలగించడానికి..థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్‌ల అవసరం లేకుండానే.. విండోస్‌లో కొన్ని బిల్ట్-ఇన్ ఫీచర్లు ఉన్నాయి. డెస్క్ టాప్ మీద రైట్ క్లిక్ చేసి..’View’ ఆప్షన్‌లోకి వెళ్లి ‘Auto-arrange icons’ లేదా ‘Align icons to grid’ సెలెక్ట్ చేసుకుంటే చాలు. చెల్లా చెదురుగా ఉన్న ఫైల్స్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం వరుసగా సర్దుకుంటాయి. అయితే .. ఇది కేవలం వాటిని సెట్ చేయడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. ఫోల్డర్ల వారీగా వర్గీకరించడానికి స్మార్ట్ టూల్స్ కావాలి.
ఫైల్స్, ఇమేజెస్, డాక్యుమెంట్లు అన్నీ వేర్వేరుగా.. వాటంతట అవే కేటగిరీల వారీగా ఫోల్డర్లలోకి.. వెళ్లాలంటే కొన్ని అమేజింగ్ యాప్స్ ఉన్నాయి. ఉదాహరణకు ‘Stardock Fences’ లేదా ఉచితంగా.. లభించే కొన్ని ఆటో-ఆర్గనైజర్ సాఫ్ట్ వేర్‌లను వాడొచ్చు. వీటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే.. మీ డెస్క్ టాప్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ డాక్యుమెంట్లు, ఇమేజ్‌లు, అప్లికేషన్లు అని వేర్వేరు బాక్సులుగా విడి పోతాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. ఒక చిన్న షార్ట్ కట్ క్రియేట్ చేసుకొని లేదా ఒక క్లిక్ ఇస్తే చాలు.. స్క్రీన్ మీద ఉన్న వేస్ట్ ఫైల్స్ అన్నీ వాటికి సంబంధించిన ఫోల్డర్లలోకి ఆటోమేటిక్‌గా వెళ్లిపోతాయి.
మీరు మాన్యువల్‌గా ఎక్కువ కష్టపడకుండా.. ఉండటానికి విండోస్‌లో ‘Storage Sense’ అనే అద్భుతమైన ఫీచర్ ఉంటుంది. ఇది మీ ల్యాప్‌టాప్‌లోని టెంపరరీ ఫైల్స్, డౌన్ లోడ్ ఫోల్డర్‌లో పాతబడిపోయిన చెత్తను ఆటో మేటిక్‌గా క్లీన్ చేస్తుంది. అలాగే.. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోని ‘Quick Access’ లేదా ‘Pin to Quick Access’ ఫీచర్‌ను వాడితే.. మీరు తరచుగా వాడే ఫోల్డర్లు కేవలం ఒక్క క్లిక్‌తో మీముందుకు వస్తాయి. దీని వల్ల ఫైల్స్ వెతికే టైమ్ చాలా వరకు సేవ్ అవుతుంది.
Also Read: ఏసీని ఎలా ఆఫ్ చేయాలి? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు
మీ ల్యాప్ టాప్ ఫైల్స్ ఎప్పటికీ గజిబిజి కాకుండా ఉండాలంటే.. ఒక చిన్న రూల్ ఫాలో అవ్వాలి. అదే ‘DARE’. డెస్క్‌టాప్ ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. వాడేసిన ప్రాజెక్ట్‌లను ‘Archive’ లోకి మార్చాలి. అవసరమైన సాఫ్ట్ వేర్లు, నోట్స్ ‘Resources’ లో దాచుకోవాలి. ఈ పద్ధతిని పాటిస్తే.. ల్యాప్ టాప్ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే.. డెస్క్ టాప్ మీద ఎక్కువ ఫైల్స్ ఉంటే.. సిస్టమ్ ప్రాసెసింగ్ స్లో అవుతుంది.
చిందరవందరగా ఉన్న ల్యాప్ టాప్ స్క్రీన్ మనసుకి కూడా చిరాకు తెప్పిస్తుంది. రోజూ గంటల తరబడి ఫైల్స్ వెతికే బదులు, ఈ చిన్న టెక్నిక్స్ లేదా.. వన్-క్లిక్ ఆర్గనైజర్ టూల్స్‌ను వాడి మీ ల్యాప్ టాప్‌ను నీట్‌గా , ఫాస్ట్‌గా ఉంచుకోండి. ఈ రోజే మీ ల్యాప్ టాప్‌లో ఈ ట్రిక్ ట్రై చేసి మీ వర్క్‌ను మరింత ఈజీ చేసుకోండి!