E-Paper
Advertisement

ల్యాప్‌టాప్, పీసీని ఎప్పుడైనా ఆల్కహాల్‌తో తుడిచారా? అలా చేసే ముందు ఇవి తెలుసుకోండి!

ల్యాప్‌టాప్, పీసీని ఎప్పుడైనా ఆల్కహాల్‌తో తుడిచారా? అలా చేసే ముందు ఇవి తెలుసుకోండి!
Advertisement

PC Cleaning Tips: మనలో చాలామంది ల్యాప్‌టాప్ లేదా పీసీని శుభ్రం చేసేటప్పుడు ఆల్కహాల్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే ఏ ఆల్కహాల్ పడితే అది వాడటం మాత్రం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా మార్కెట్లో లభించే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (Isopropyl Alcohol) 70%, 91%, 99% వంటి వివిధ పర్సంటేజీల్లో ఉంటుంది. వీటి మధ్య తేడా తెలియకుండా వాడితే కొన్ని సందర్భాల్లో కంప్యూటర్‌ భాగాలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి ల్యాప్‌టాప్, పీసీని క్లీన్ చేయడానికి ఏ పర్సంటేజ్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వాడాలి? ఏది సురక్షితం? ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ పర్సంటేజ్ ఎక్కడ వాడాలి?

పీసీ లోపల ఉన్న మదర్‌బోర్డు, సర్క్యూట్ బోర్డులు క్లీన్ చేయడానికి కనీసం 91% లేదా 99% ఆల్కహాల్ ఉన్నదే వాడాలి. ఒకవేళ 70% ఆల్కహాల్ వాడితే అందులో 30% నీరు ఉంటుంది. ఈ నీరు త్వరగా ఆవిరి కాకుండా అలాగే ఉండిపోతుంది. మనం ఆన్ చేసిన వెంటనే షార్ట్ సర్క్యూట్ అయ్యి పీసీ కాలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా లోపల ఉండే మెటల్ పార్ట్స్ తుప్పు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. 70% ఆల్కహాల్ కేవలం కీబోర్డ్ కీక్యాప్స్, మౌస్ వంటి బయట ప్లాస్టిక్ భాగాలను తుడుచుకోవడానికి మాత్రమే సరిపోతుంది.

Advertisement

Also Read: ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

ఎక్కడ వాడకూడదు?

కొన్ని భాగాలకు ఆల్కహాల్ అస్సలు టచ్ చేయకూడదు. ముఖ్యంగా కంప్యూటర్ మానిటర్ స్క్రీన్‌లపై ఆల్కహాల్ రాస్తే దానిపై ఉండే ప్రొటెక్టివ్ కోటింగ్ పోతుంది. అలాగే పారదర్శక ప్లాస్టిక్ (అక్రిలిక్స్), సాఫ్ట్ రబ్బరు భాగాలు, గ్లూతో అంటించిన భాగాలపై ఇది పనిచేయదు. కంప్యూటర్ ఆన్‌లో ఉన్నప్పుడు అయితే పొరపాటున కూడా క్లీనింగ్ జోలికి వెళ్లకూడదు. ప్రాసెసర్‌పై ఉండే థర్మల్ పేస్ట్ క్లీన్ చేయడానికి మాత్రం హై-ప్యూరిటీ ఆల్కహాల్ చక్కగా పనిచేస్తుంది.

పొరపాటున తప్పు ఆల్కహాల్ వాడితే?

Advertisement

తెలియక తప్పు పర్సంటేజ్ ఆల్కహాల్ వాడి నీరు ఇరుక్కుపోతే.. వెంటనే కంప్యూటర్ ఆఫ్ చేసేయాలి. ఎందుకైనా మంచిది పవర్ కేబుల్ తీసేయాలి. ఏదైనా క్లాత్‌తో అదనపు ద్రవాన్ని తుడిచి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. చాలామంది బియ్యంలో పెట్టే చిట్కాలు ట్రై చేస్తుంటారు. కానీ అవి అంతగా పనిచేయవు. కనీసం 24 గంటలు, వీలైతే 72 గంటల పాటు పూర్తిగా ఆరేవరకు పీసీని ఆన్ చేయకుండా ఉండటమే మంచిది.

జాగ్రత్తలు ముఖ్యం..

పీసీ క్లీనింగ్ అనేది ఎప్పుడూ కాస్త జాగ్రత్తగా చేయాల్సిన పనే. ఏమాత్రం తేడా కొట్టినా వేల రూపాయల నష్టం వస్తుంది. అందుకే సరైన పర్సంటేజ్ ఉన్న ఐసోప్రొపైల్ ఆల్కహాల్ మాత్రమే ఎంచుకోవడం మంచిది. చిన్న పొరపాటు కూడా మీ సిస్టమ్‌ను శాశ్వతంగా పాడుచేయగలదు.

Also Read: Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

Tags

Related News

ల్యాప్ ట్యాప్ స్లో అయిందా? ఈ ఒక్క మ్యాజిక్ ట్రిక్‌తో క్షణాల్లో ఫైల్స్ అన్నీ సెట్!

ఇంట్లోనే సినిమా థియేటర్ మజా.. అమెజాన్‌లో టాప్‌లో ఉన్న 5 బెస్ట్ ప్రాజెక్టర్ స్క్రీన్స్ ఇవే!

ఏసీని ఎలా ఆఫ్ చేయాలి? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

చూడటానికి అల్ట్రా రిచ్.. పనిలో సూపర్ ఫాస్ట్! ట్రెండింగ్‌లో బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు !

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

Big Stories

Advertisement
×