How to turn off AC remote or switch: ఇంట్లో ఏసీ వాడటం ఎంత ముఖ్యమో.. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఏసీ ఆన్ చేయడం, టెంపరేచర్ తగ్గించడం అందరికీ తెలుసు. కానీ.. దాన్ని వాడటం అయిపోయిన తర్వాత ఎలా ఆఫ్ చేయాలనే దానిపై చాలా మందికి క్లారిటీ ఉండదు. కొంత మంది కేవలం రిమోట్‌పై ఉన్న పవర్ బటన్ నొచ్చి వదిలేస్తారు. మరి కొంతమంది రిమోట్‌తో.. ఆఫ్ చేసినా వెంటనే గోడ మీద ఉన్న మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేస్తారు. అసలు ఏ పద్ధతి కరెక్ట్? ఏది చేస్తే ఏసీ ఎక్కువ కాలం ఏసీ పాడవకుండా ఉంటుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రిమోట్‌లోని పవర్ బటన్ నొక్కినప్పుడు ఏసీ వెంటనే ఆఫ్ అయినట్లు కనిపిస్తుంది. కానీ.. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. రిమోట్ ద్వారా ఏసీని ఆఫ్ చేసినప్పుడు.. కంప్రెసర్, బ్లోవర్ వంటి ప్రధాన భాగాలు సేఫ్‌గా షట్ డౌన్ అవ్వడానికి కొంత టైమ్ పడుతుంది. ఇండోర్ యూనిట్‌లోని ఫ్యాన్ కొద్ది సేపు తిరిగి ఆటోమేటిక్‌గా స్టాప్ అవుతుంది. ఇది ఏసీ మెకానిజమ్‌కు చాలా సేఫ్. కంపెనీలు కూడా ముందుగా రిమోట్‌తోనే ఏసీని స్టాప్ చేయాలని సిఫార్సు చేస్తుంటాయి.
కొందరు ఏసీ ఆపగానే.. మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. మరి కొందరు స్మార్ట్ ప్లగ్స్ అని నేరుగా కరెంట్ కట్ చేస్తుంటారు. ఇలా చేయడం ఏసీకి చాలా డేంజర్! ఏసీ రన్నింగ్‌లో ఉన్నప్పుడు సడన్‌గా మెయిన్ పవర్ కట్ చేస్తే.. కంప్రెసర్‌పై తీవ్రమైన లోడ్ పడుతుంది. దీని వల్ల వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి పీసీబీ బోర్డు కాలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. పదే పదే ఇలా చేస్తే ఏసీ తరచూ రిపేర్లు వస్తాయి.
ముందుగా ఏసీ రిమోట్‌తో పవర్ బటన్ నొక్కి దాన్ని స్టాండ్ బై మోడ్‌లోకి తేవాలి. ఆ తర్వాత ఇండోర్ యూనిట్ ఫ్యాన్ పూర్తిగా ఆగిపోయే వరకు 2 నుండి 3 నిమిషాలు వెయిట్ చేయాలి. ఫ్యాన్ ఆగిన తర్వాత.. మీ ఇంట్లో పవర్ సేవింగ్ లేదా సేఫ్టీ కోసం కావాలనుకుంటే .. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే.. మీరు రోజువారీ వాడకంలో ఉంటే కేవలం.. రిమోట్‌తో ఆఫ్ చేసినా సరి పోతుంది. ఎందుకంటే.. రిమోట్ ఆఫ్ చేసిన మోడ్‌లో కూడా కంప్రెసర్ పూర్తిగా రెస్ట్ మోడ్‌లోకి వెళ్తుంది. కేవలం వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు లేదా లాంగ్ టర్మ్ ఎక్కడికైనా.. వెళ్లేటప్పుడు మాత్రమే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం బెస్ట్.
Also Read: చూడటానికి అల్ట్రా రిచ్.. పనిలో సూపర్ ఫాస్ట్! ట్రెండింగ్‌లో బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు !
రిమోట్‌తో ఆఫ్ చేసినప్పుడు..సీ పూర్తిగా కరెంట్ కట్ అవ్వదు. స్టాండ్‌బై మోడ్‌లో .. చాలా తక్కువ పవర్ (కొన్ని వాట్స్) ఖర్చు అవుతుంది. దీని వల్ల కరెంట్ బిల్లుపై పెద్దగా ప్రభావం పడదు. కాబట్టి బిల్లు తక్కువ వస్తుందనే ఉద్దేశంతో ప్రతిసారీ మెయిన్ స్విచ్ బంద్ చేయడం వల్ల ఏసీ పాడయ్యే. ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. ఒక రిపేర్ ఖర్చుతో పోలిస్తే .. ఆ కొద్ది పాటి కరెంట్ చాలా తక్కువ!
మొత్తంగా చెప్పాలంటే.. ఏసీ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే దాన్ని ఆపరేట్ చేసే విధానం చాలా ముఖ్యం. ఏసీ వాడకం అయిపోగానే తొందరపడి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసే.. అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎప్పుడూ రిమోట్‌తో ఆఫ్ చేసి.. కాస్త టైమ్ ఇచ్చి సేఫ్‌గా షట్ డౌన్ చేయడం బెస్ట్. ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే.. మీ ఏసీ ఏళ్ల తరబడి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలింగ్ ఇస్తూనే ఉంటుంది.