E-Paper
Advertisement

టాటా To మహీంద్రా.. భారత మార్కెట్ లోకి అడుగు పెట్టనున్న 5 ఈవీలు ఇవే!

టాటా To మహీంద్రా.. భారత మార్కెట్ లోకి అడుగు పెట్టనున్న 5 ఈవీలు ఇవే!
Advertisement

Upcoming EVs in India: భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే చిన్న కార్ల నుంచి ప్రీమియం SUVల వరకు పలు ఎలక్ట్రిక్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు కార్ల తయారీ సంస్థలు కొత్త EVలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలో భారత మార్కెట్లోకి రానున్న ఐదు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టాటా ఏరిస్ EV

టాటా మోటార్స్ కొత్త ఏరిస్ EVతో ఎలక్ట్రిక్ సెడాన్ విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మోడల్‌ లో ముందు భాగంలో కొత్త హెడ్‌ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త బంపర్ కనిపించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా కొత్త టెయిల్ ల్యాంప్స్, రిఫ్లెక్టర్ బార్ లాంటి మార్పులు ఉండనున్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే 19 kWh, 24 kWh ఆప్షన్లు అందించే అవకాశం ఉంది. ఏరిస్ EV సెప్టెంబర్ 25న విడుదలయ్యే అవకాశం ఉంది.

టాటా సఫారీ EV

Advertisement

టాటా నుంచి రాబోతున్న మరో కీలక ఎలక్ట్రిక్ SUV సఫారీ EV. కంపెనీ తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా రానుంది. ప్రస్తుత సఫారీ డిజైన్‌ను పోలి ఉన్నప్పటికీ, EVకి తగ్గట్టుగా క్లోజ్డ్ గ్రిల్, కొత్త వీల్స్, అప్‌డేటెడ్ LED లైట్స్ వంటి మార్పులు ఉంటాయి. క్యాబిన్‌లో ప్రీమియం ఫీచర్లతో పాటు పెద్ద డిస్‌ ప్లే సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఉండనున్నాయి. 65 kWh, 75 kWh బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీతో సుమారు 600 కి.మీ.కు పైగా రేంజ్ లభించే అవకాశం ఉంది.

హ్యుందాయ్ He1i

హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న కొత్త కాంపాక్ట్ EVపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం He1i పేరుతో పిలుస్తున్న ఈ కారు 4 మీటర్లలోపు ఉండే అవకాశం ఉంది. దీంతో టాటా పంచ్ EV, కియా సైరోస్ EV లాంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది. బాక్సీ డిజైన్‌తో పాటు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్రీమియం ఇంటీరియర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. 42 kWh, 49 kWh బ్యాటరీ ఆప్షన్లతో 300 కి.మీ.కు పైగా రేంజ్ అందించే అవకాశం ఉంది.

మహీంద్రా BE 07

Advertisement

మహీంద్రా BE07 ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్లోకి రానుంది. క్రెటా EV, మారుతి e Vitara లాంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. పరిమాణంలో పెద్దదిగా ఉండటం వల్ల క్యాబిన్ స్పేస్ కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ట్రిపుల్ స్క్రీన్ సెటప్, పెద్ద గ్లాస్ రూఫ్, లెవల్ 2 ADAS లాంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 59 kWh, 70 kWh, 79 kWh బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ SUV వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చని అంచనా.

JSW iCar V23

JSW కూడా చెరీ iCar V23 ఆధారంగా కొత్త ఎలక్ట్రిక్ SUVను భారత్‌ లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపించిన ఈ SUV బాక్సీ, రగ్గడ్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. పనోరమిక్ సన్‌రూఫ్, 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. చైనాలోని iCar V23లో 59.93 kWh, 81.76 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో వరుసగా RWD, AWD సెటప్‌లు లభిస్తాయి. భారత్‌కు కూడా AWD వెర్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

Read Also: వాగన్ఆర్ To ఎలక్ట్రిక్ MPV.. మారుతి నుంచి రాబోతున్న 4 క్రేజీ ఫ్యూచర్ కార్లు ఇవే!

Tags

Related News

CNGతో పాటు AMT కూడా.. మారుతి డిజైర్, స్విఫ్ట్ కొత్త వెర్షన్లు విడుదల!

వాగన్ఆర్ To ఎలక్ట్రిక్ MPV.. మారుతి నుంచి రాబోతున్న 4 క్రేజీ ఫ్యూచర్ కార్లు ఇవే!

మైలేజీ ఎక్కువ.. ఖర్చు తక్కువ.. 5 బెస్ట్ బడ్జెట్ స్కూటర్లు ఇవే!

కేరెన్స్, క్లావిస్‌ కు CNG పవర్.. ధరలు ఎంతో తెలుసా?

మైలేజీకి మారుతి కొత్త ప్లాన్.. బాలెనో CNG-AMT వచ్చేసింది!

టిగోర్ స్థానంలో టాటా ఏరిస్.. డిజైర్, అమేజ్‌ కు గట్టి పోటీ తప్పదా?

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×