E-Paper
Advertisement

USB-A To USB-C కేబుల్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమేనా? టెక్ నిపుణులు ఏం చెబుతున్నారంటే!

USB-A To USB-C కేబుల్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమేనా? టెక్ నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Advertisement

USB-C Cables: కొత్త ఫోన్ కొన్నప్పుడు మనం చూసే ముఖ్యమైన ఫీచర్లలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఒకటి. ఎంత వేగంగా ఫోన్ ఛార్జ్ అవుతుంది? ఎన్ని వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది? అనే విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ప్రస్తుతం చాలా ఫోన్లలో USB-C పోర్ట్, USB-C ఛార్జర్లు కామన్ అయిపోయాయి. అయితే ఇక్కడే చాలామందికి ఓ డౌట్ వస్తుంది. పాత USB-A నుంచి USB-C కేబుల్ ఉపయోగిస్తే మన ఫోన్ కూడా ఫాస్ట్ ఛార్జ్ అవుతుందా?

సింపుల్‌గా చెప్పాలంటే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో USB-A నుంచి USB-C కేబుల్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమే. కానీ కొత్త USB-C టు USB-C కేబుల్‌తో వచ్చే ఛార్జింగ్ స్పీడ్‌ను మాత్రం ప్రతి సందర్భంలోనూ పొందలేం. దీనికి ప్రధాన కారణం USB-A పోర్ట్‌కి ఉన్న పవర్, ఛార్జింగ్ ప్రోటోకాల్ పరిమితులే. మరి USB-A నుంచి USB-C కేబుల్‌తో అసలు ఎంతవరకు ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమవుతుంది? USB-C టు USB-C ఎందుకు ఎక్కువ స్పీడ్ ఇస్తుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

పాత టెక్నాలజీ పరిమితులు:

Advertisement

USB-A పోర్టులు మనకు చాలా ఏళ్లుగా అందుబాటులో ఉన్నాయి. USB 2.0 పోర్ట్ సాధారణంగా 2.5W వరకు, USB 3.0 పోర్ట్ సుమారు 15W వరకు పవర్ అందిస్తుంది. మరోవైపు USB-C టెక్నాలజీ మాత్రం చాలా ఎక్కువ పవర్‌ను హ్యాండిల్ చేయగలదు. కొన్ని USB-C కేబుల్స్ 240W వరకు పవర్‌ను సపోర్ట్ చేస్తాయి. అయితే అన్ని Type-C కేబుల్స్ 240W ఛార్జింగ్ ఇస్తాయని కాదు. కేబుల్, ఛార్జర్, ఫోన్.. ఈ మూడింటి సామర్థ్యాన్ని బట్టి అసలు ఛార్జింగ్ స్పీడ్ మారుతుంది.

Also Read: ఇంట్లోనే సినిమా థియేటర్ మజా.. అమెజాన్‌లో టాప్‌లో ఉన్న 5 బెస్ట్ ప్రాజెక్టర్ స్క్రీన్స్ ఇవే!

స్పీడ్ దేనిపై ఆధారపడి ఉంటుంది?

Advertisement

మీ ఫోన్ ఎంత వేగంగా ఛార్జ్ అవుతుందనేది ప్రధానంగా కేబుల్, పవర్ అడాప్టర్, ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి ఫాస్ట్ ఛార్జింగ్‌కు సరిపోకపోయినా స్పీడ్ తగ్గుతుంది. ఉదా: ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ప్రీమియం ఫోన్ ఉన్నా.. తక్కువ పవర్ ఉన్న అడాప్టర్ లేదా సరైన కేబుల్ ఉపయోగిస్తే ఆ ఛార్జింగ్ స్పీడ్‌ను పూర్తిగా పొందలేం. అందుకే ఫోన్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ స్టాండర్డ్‌కు సరిపోయే ఛార్జర్, కేబుల్ వాడటం ముఖ్యం.

ఎక్కువ వాట్స్ అంటే ప్రమాదమా?

ఎక్కువ వాట్స్ ఉన్న ఛార్జర్‌ను ఉపయోగిస్తే.. ఫోన్ పాడవుతుందనే భయం చాలామందికి ఉంటుంది. సాధారణంగా ఫోన్ తనకు అవసరమైన పవర్‌ను మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఎక్కువ సామర్థ్యం ఉన్న ఛార్జర్‌ను ఉపయోగించడం మాత్రమే ప్రమాదకరం కాదు. అయితే ఛార్జింగ్ సమయంలో ఫోన్ అసాధారణంగా వేడెక్కుతుందా అనేది గమనించాలి. ఎక్కువ వేడి బ్యాటరీ ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు.

చీప్ కేబుల్స్‌ను వాడొద్దు:

తక్కువ ధరలో దొరికే నాణ్యత లేని లేదా డూప్లికేట్ కేబుల్స్‌ను ఉపయోగించడం మంచిది కాదు. సరైన క్వాలిటీ, సేఫ్టీ ప్రమాణాలు లేని కేబుల్స్ వల్ల ఛార్జింగ్ సమస్యలు, వేడెక్కడం వంటి ఇబ్బందులు రావచ్చు. అందుకే వీలైనంత వరకు నమ్మకమైన బ్రాండ్లకు చెందిన కేబుల్స్, ఛార్జర్లనే ఉపయోగించడం సురక్షితం. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మీ ఫోన్‌కు సరిపోయే USB-C టు USB-C కేబుల్, అనుకూలమైన పవర్ అడాప్టర్ ఎంచుకోవడం ఉత్తమం.

Also Read: ల్యాప్‌టాప్, పీసీని ఎప్పుడైనా ఆల్కహాల్‌తో తుడిచారా? అలా చేసే ముందు ఇవి తెలుసుకోండి!

Tags

Related News

ఎలక్ట్రానిక్స్‌కు ఎక్స్‌ట్రా వారెంటీ నిజంగా అవసరమా? ఈ ట్రిక్స్‌తో డబ్బు ఆదా చేసుకోండి!

ఏఐ ప్రపంచంలో కొత్త ప్రమాదం..హ్యాకర్ల లేటెస్ట్ టార్గెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు!

ల్యాప్ ట్యాప్ స్లో అయిందా? ఈ ఒక్క మ్యాజిక్ ట్రిక్‌తో క్షణాల్లో ఫైల్స్ అన్నీ సెట్!

ఇంట్లోనే సినిమా థియేటర్ మజా.. అమెజాన్‌లో టాప్‌లో ఉన్న 5 బెస్ట్ ప్రాజెక్టర్ స్క్రీన్స్ ఇవే!

ల్యాప్‌టాప్, పీసీని ఎప్పుడైనా ఆల్కహాల్‌తో తుడిచారా? అలా చేసే ముందు ఇవి తెలుసుకోండి!

ఏసీని ఎలా ఆఫ్ చేయాలి? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

చూడటానికి అల్ట్రా రిచ్.. పనిలో సూపర్ ఫాస్ట్! ట్రెండింగ్‌లో బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు !

Big Stories

Advertisement
×