BigTV English

Ozone layer : దెబ్బతిన్న ఓజోన్ లేయర్.. అదే కారణం..

Ozone layer : దెబ్బతిన్న ఓజోన్ లేయర్.. అదే కారణం..
Ozone layer

Ozone layer : భూగ్రహం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియని మిస్టరీ ఏదో ఒకటి ఉంటుంది. ప్రస్తుతం మానవాళి అనేది భూగ్రహం పైన ఉన్న ట్రోపోస్పియర్‌పైన జీవనం కొనసాగిస్తోంది. ఇది అట్మాస్ఫియర్‌లోని లోయర్ లేయర్‌గా చెప్పబడుతోంది. ఇందులో మానవాళికి అవసరమయ్యే ఆక్సిజన్ శాతం సరిపడా దొరుకుతుంది. ఈ ట్రోపోస్పియర్‌పైన ఉండే లేయర్ ఓజోన్. ప్రస్తుతం ఈ ఓజోన్‌కు ప్రమాదం పొంచివుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.


ఓజోన్ (ఓ3) అల్ట్రావైలెట్ రేడియేషన్ భూమిని తాకకుండా ఒక ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో ఓజోన్ లేయర్ గురించి ప్రత్యేకంగా ఒక చాప్టరే ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఓజోన్ లేయర్ దెబ్బతింటోంది అన్న విషయం కూడా ఆ పాఠాల్లో చదివే ఉంటాం. అప్పటినుండి ఇప్పటివరకు ఓజోన్‌కు జరుగుతున్న హాని పెరుగుతుందే తప్పా.. తగ్గడం లేదు. తాజాగా ఈ ఓజోన్ లేయర్ దెబ్బతినడానికి మరో కొత్త కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.

అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఫారిన్ దేశాల్లో కార్చిచ్చు అనేది కామన్‌గా కనిపిస్తుంటుంది. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఈ కార్చిచ్చు వల్ల ఓజోన్ లేయర్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో పాటు మనుషుల తయారు చేసే కెమికల్స్ వల్ల విడుదలవుతున్న కొన్ని హానికరకమైన గ్యాసులు కూడా ఈ కార్చిచ్చు మంటలతో కలిసి ఓజోన్ లేయర్ దెబ్బతినేలా చేస్తున్నాయని వారు బయటపెట్టారు. ఆస్ట్రేలియాలో 2019-20 వేసవికాలంలో జరిగిన కార్చిచ్చు ఘటనే శాస్త్రవేత్తలు కొలమానంగా తీసుకొని పరిశోధనలు చేశారు.


ఆస్ట్రేలియా కార్చిచ్చు తర్వాత ఓజోన్ లేయర్‌పై పడిన రంధ్రం 10 శాతం పెరిగిందని శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని బట్టి చూస్తే.. ఆస్ట్రేలియాకంటే ముందు ఇతర దేశాల్లో జరిగిన కార్చిచ్చు ఘటనల వల్ల భూమి మానవాళి జీవనానికి కష్టంగా మారనుందని వారు హెచ్చరిస్తున్నారు. అల్ట్రావైలెట్ రేస్ నుండి భూమిని కాపాడడానికి ఎన్ని ఇతర మార్గాలు కనుక్కున్నా అవి ఓజోన్ లేయర్ అంత బలంగా ఉండవని, అందుకే దీనిని మనం కాపాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనికి కావాల్సిన సన్నాహాలు కూడా వారు మొదలుపెట్టారు.

Tags

Related News

Dance Heart Attack: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి

Smart phones 2025: టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. రూ. 20 వేల కంటే తక్కువ బడ్జెట్ ఫోన్లు ఇవే..

OnePlus Discount: 6,000mAh బ్యాటరీ, 50 MP కెమెరా.. వన్‌ప్లస్ మిడ్‌రేంజ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Smartphone Comparison: పోకో X7 ప్రో vs ఓప్పో F31 vs రియల్మీ P4 ప్రో.. ఏది బెస్ట్?

Verify Fake iphone: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి

Oppo Phone: 56జిబి స్టోరేజ్, 5జి స్పీడ్.. ఫ్లిప్ మోడల్‌లో కొత్త సెన్సేషన్..

Motorola Mobiles: ఒకే ఫోన్‌లో అన్నీ! ఫాస్ట్ ఛార్జ్ తో వచ్చేసిన మోటరోలా అల్ట్రా బీస్ట్!

Wifi Plans Free OTT: 100Mbps వైఫై.. ఉచితంగా ఓటీటీ.. బెస్ట్ ప్లాన్స్ ఇవే

Big Stories

×