Personal Air Cooler: ఎండలు మండిపోతున్న ప్రస్తుత కాలంలో, ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా కూడా చల్లదనం కొంతవరకే పరిమితమవుతుంది. ముఖ్యంగా చిన్న గదుల్లో లేదా వ్యక్తిగత అవసరాలకు ఇవి సరిపోవు. ఇలాంటి సమయంలో చల్లదనాన్ని నేరుగా మీ దగ్గరికి తీసుకొచ్చే చక్కటి పరిష్కారం మార్కెట్‌లోకి వచ్చేసింది. అదే Drumstone Personal Air Cooler. ఇది చిన్నది, స్టైలిష్‌గా ఉండి, వాడటానికి సులభంగా ఉంటుంది. మీరు చదువుతున్నా, పనిచేస్తున్నా లేదా రిలాక్స్ అవుతున్నా ఎక్కడైనా దీనిని మీకు నచ్చిన చోట ఉంచుకోవచ్చు. బడ్జెట్ ధరల్లో రూ. 1299కే వస్తున్న దీనికి 15 ఏళ్ల వారంటీ సౌకర్యం కూడా ఉంది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
చూసే వారికి మాత్రం..
Drumstone మినీ ఎయిర్ కూలర్ సాధారణంగా చూసే వారికి టేబుల్ ఫ్యాన్‌లా కనిపించవచ్చు. కానీ దీని పనితనం మాత్రం మాములుగా ఉండదు. ఇందులో ఉన్న 3 విండ్ స్పీడ్‌లు (Low, Medium, High), 3 స్ప్రే మోడ్‌లను ఉపయోగించి త్వరగా చల్లదనాన్ని అందిస్తాయి. ఈ కూలర్ సాంకేతికంగా ఎవాపొరేటివ్ కూలింగ్ టెక్నాలజీను ఉపయోగిస్తుంది. అంటే నీటి ద్వారా చల్లని గాలిని అందిస్తుంది.
మీ మూడ్‌కు తగ్గట్టు
వేడిమి రోజుల్లో కూల్‌గా ఉండటమే కాకుండా, మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఈ Drumstone కూలర్ కల్పిస్తుంది. ఎందుకంటే ఇది 7 రంగుల LED లైట్స్ తో వస్తుంది. ఇవి మీ గదిలో రాత్రి సమయంలో కూడా ఆకర్షణీయంగా బ్యూటిఫుల్ నైట్ ల్యాంప్ మాదిరిగా పనిచేస్తాయి. మీరు స్టడీ చేస్తున్నా, రిలాక్స్ అవుతున్నా కూడా ఈ లైట్స్ మీ మూడ్‌ను హాయిగా మార్చేస్తాయి.
టైమర్ సెట్ చేసుకునే సౌలభ్యం
Drumstone Air Coolerలో టైమర్ ఫంక్షన్ కూడా ఉంది. మీరు 1, 2 లేదా 3 గంటల తరువాత ఇది ఆటోమేటిక్‌గా ఆగేలా సెట్ చేసుకోవచ్చు. ఇది విద్యుత్‌ను ఆదా చేయడంలో సహాయపడుతుంది. ప్రత్యేకించి రాత్రి వేళ మీరు పడుకోబోతున్నపుడు చాలా ఉపయోగపడుతుంది.
ఇతర లక్షణాలు:
-పోర్టబుల్ డిజైన్- ఈ కూలర్ ను తేలికగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కిచెన్, బెడ్‌రూమ్, స్టడీ రూమ్ లేదా ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు.
-3 విండ్ స్పీడ్స్ – అవసరానికి తగ్గట్టు గాలి వేగాన్ని సెట్ చేసుకోవచ్చు.
-3 మోడ్ స్ప్రే ఫంక్షన్ – మిస్టింగ్ స్ప్రే ద్వారా చల్లదనం ఎక్కువగా వస్తుంది.
-యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ – ఉపయోగించడంలో చాలా ఈజీ. ఏ వయస్సు వారైనా సులభంగా వాడొచ్చు.
-USB ద్వారా ఛార్జ్ చేయవచ్చు – పవర్ బ్యాంక్‌తో కూడ గడిపే కాలంలో ఇది వర్క్ అవుతుంది.
-15 సంవత్సరాల వారంటీ – ఇది Drumstone ఇచ్చే అతిపెద్ద హామీ 15 ఏళ్ల వారంటీ అంటే మళ్లీ మళ్లీ కూలర్ కొనే అవసరం లేదు.
Read Also: Smartwatch Offer: బడ్జెట్ ధరల్లో ఫాస్ట్రాక్ ప్రీమియం …
భయం అక్కర్లేదు
ఎయిర్ కండీషనర్లతో వచ్చే పెద్ద ఎలక్ట్రిక్ బిల్లులను చూసి చాలామంది భయపడతారు. కానీ Drumstone కూలర్ చాలా తక్కువ పవర్‌తో పనిచేస్తుంది. దీన్ని మీ లాప్‌టాప్, పవర్ బ్యాంక్ లేదా యూఎస్బీ ఛార్జర్‌తో కూడా నడిపించవచ్చు. చిన్న గదుల్లో ఇది ఏసీ కన్నా బెటర్‌గా పనిచేస్తుంది.
పర్యావరణ అనుకూలం..
ఈ Drumstone మినీ కూలర్‌లో హానికరమైన కెమికల్స్ ఉండవు. గాలి శుద్ధిని మెరుగుపరచే నీటి మిస్ట్‌ను వాడుకుని, ఇది పర్యావరణాన్ని ప్రభావితం చేయదు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు దీని డిజైన్ కూడా సౌమ్యంగా ఉంటుంది.
ఇంటి కోసం, ఆఫీస్ కోసం, పిల్లల కోసం
ఈ Drumstone కూలర్‌ను ఇంట్లో పిల్లలు చదువు కునేటప్పుడు వాడవచ్చు. వృద్ధులు విశ్రాంతిగా కూర్చొని పుస్తకాలు చదువుతుంటే, చిన్న స్టార్టప్ ఆఫీస్‌లలో ఇది మంచి పరిష్కారం. ఇవన్నీ కాకుండా, క్యాంపింగ్ ట్రిప్స్‌కైనా కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
దీనిలో ఏం లభిస్తాయి
ప్యాకేజింగ్‌లో మీకు లభించేవి: Drumstone మినీ ఎయిర్ కూలర్, USB ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్
ఎక్కడ దొరుకుతుంది?
ఈ Drumstone పర్సనల్ ఎయిర్ కూలర్‌ను మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ సైట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.2,999 కాగా, ప్రస్తుతం 57 శాతం తగ్గింపు ధరతో రూ.1299కే అమెజాన్ లో అందుబాటులో ఉంది.