E-Paper
Advertisement

Electric Trucks: త్వరలోనే రోడ్లపైకి ఎలక్ట్రిక్ ట్రక్కులు..

Electric Trucks: త్వరలోనే రోడ్లపైకి ఎలక్ట్రిక్ ట్రక్కులు..
Advertisement

Electric trucks: ఒకప్పుడు వాహనాలు అంటే ఎడ్ల బండ్లు మాత్రమే. వాటిపైనే ఎన్ని కిలోమీటర్ల అయినా అవలీలగా ప్రయాణం చేసేవారు. ఆ తర్వాత మనుషులకు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలనే ఆశ కలిగింది. ఆ ఆశతోనే కొత్త కొత్త వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. అలాగే కొత్త రకమైన వాహనాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కరెంటుతో నడిచే వాహనాలే మార్కెట్‌ను ఏలుతున్నాయి. త్వరలో ఇవే మరో సంచలనంగా మారనున్నాయని నిపుణులు చెప్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రానిక్ స్కూటర్లు, కార్ల హవా పెరిగిపోతోంది. అయితే మరికొన్ని సంవత్సరాల్లో భారీ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ అయిపోతాయని నిపుణులు చెప్తున్నారు. ట్రక్కులు లాంటి వాహనాలు కూడా ఎలక్ట్రిక్ అవుతాయని అంటున్నారు. ప్రస్తుతం ట్రక్కుల్లో పెట్టే బ్యాటరీల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ట్రక్కుల లాంటి పెద్ద వాహనాలకు ఎలా సెట్ అవుతాయి అనే విషయంలో టెక్ నిపుణులు పరిశోధనల్లో నిమగ్నయిపోయిన్నారు.

Advertisement

టెస్లా సంస్థ ఇప్పటికే సెమీట్రాక్టర్స్ లాంటి వాహనాలను ఎలక్ట్రిక్‌గా తయారు చేసి పెద్ద వాహనాల్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్ తయారు చేసిన కంపెనీగా రికార్డ్ సాధించింది. ఆ తర్వాత అమెజాన్ కూడా డెలివరీ వ్యాన్స్‌ను ఎలక్ట్రిక్ మోడ్‌లో ఉన్నవే ఉపయోగిస్తోంది. దాదాపు 500 సిటీలలో ఈ ఎలక్ట్రిక్ డెలివరీ వ్యాన్స్ నడుస్తూ ఉన్నాయి. త్వరలోనే మరిన్ని సిటీలలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కనిపించనున్నాయని సంస్థ చెప్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయి పెద్ద ఎలక్ట్రిక్ ట్రక్కులను మాత్రం టెస్లానే తయారు చేస్తోంది.

బ్యాటరీ టెక్నాలజీ అనేది చిన్న వాహనాలకు సులువుగా అటాచ్ అవుతుందని, ట్రక్కుల లాంటి వాహనాలు ఎక్కువ బరువును మోస్తాయి కాబట్టి వాటికి బ్యాటరీ టెక్నాలజీని అటాక్ చేయడం కాస్త కష్టమైన విషయమని నిపుణులు బయటపెట్టారు. అలా అని బ్యాటరీ ఎక్కువ బరువుతో ఉండొద్దని కూడా వారు చెప్తున్నారు. పైగా బ్యాటరీ ట్రక్కులకు ఛార్జింగ్ పెట్టడంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. ఇక ఈ బ్యాటరీకి తగినట్టు ట్రక్కుల తయారీ కూడా పూర్తిగా మార్చాలని తెలిపారు. ఇలా అన్ని అంశాలు సరిగ్గా కుదిరినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ట్రక్కుల రోడ్ల మీద తిరుగుతాయని పరిశోధకులు బయటపెట్టారు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×