Big Stories

Foodborne Diseases: ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు.. కనిపెట్టే కొత్త టెక్నాలజీ..

Foodborne Diseases: బ్యాక్టీరియా అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది చెప్పడం కష్టం. కానీ పలు ప్రాంతాల్లో పెరిగే బ్యాక్టీరియా మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అంతే కాకుండా వారి ప్రాణాలకు కూడా ప్రమాదం తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో పెరిగే బ్యాక్టీరియా అనేది ముందుగా కనుక్కోవడం కష్టమని, దాని వల్ల కూడా ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ఆ బ్యాక్టీరియాను ముందుగా కనుక్కోవడం కోసం ఓ కొత్త టెక్నిక్‌ను కనుగొన్నారు.

- Advertisement -

పాలకూరలో మనిషిని అనారోగ్యానికి గురిచేసే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చారు. అందులో సాల్మొనెల్లా, లిస్టీరియా, మోనోసైటోజీన్స్, ఈ కొలీ వంటి బ్యాక్టీరియా రకాలు పుడతాయని తెలిపారు. ఫుడ్ టెస్టింగ్ అనేది ముందుగానే జరిగినా కూడా ఒకవేళ ఆహారం వల్ల మనిషి అనారోగ్యానికి గురయితే.. వారు ఏ ఆహరం తినడం వల్ల అలా జరిగింది అని వెంటనే కనుక్కోవడం కష్టమన్నారు. అమెరికాలో ఇలాంటి కేసులు తరచుగా కనిపిస్తుంటాయి.

- Advertisement -

శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియా రకాలు తమ ఆహారంలో దొరికాయా అని ముందుగా కనుక్కుంటే పేషెంట్లకు చికిత్సను అందించడం కూడా సులభం అవుతుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ఆహారం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను కనిపెట్టడానికి కేవలం మూడు నుండి ఆరు గంటల సమయం చాలని చెప్తున్నారు. ముఖ్యంగా పాలకూరలో ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా తొందరగా వ్యాప్తి చెందుతుందని, దాని వల్లే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అందుకే ముందుగా దానిపై టెస్టింగ్ చేస్తున్నామని అన్నారు.

బయోటెక్నాలజీ ద్వారా ఇలాంటి ఆహార పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను సులువుగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని వల్లే ఫుడ్ సేఫ్టీ, పబ్లిక్ హెల్త్ వంటి అంశాలపై ఎఫెక్ట్ పడుతుందని తెలిపారు. మనుషుల లాగానే మొక్కలు కూడా బ్యాక్టీరియాను ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తాయని కానీ కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వవని చెప్తున్నారు. తాజాగా ఆహార పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి తయారు చేసిన టెక్నాలజీ వర్చువల్ ఫార్మింగ్ ద్వారా ముందుకెళ్తుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News