Big Stories

Elon Musk:- చాట్‌జీపీటీకి పోటీగా ఎలన్ మస్క్ మాస్టర్ ప్లాన్..

Elon Musk:- టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టెక్ వరల్డ్‌లో ఎక్కడ చూసినా ఏఐ హవా నడుస్తోంది. ఇక ఈ ఏఐను ఉపయోగించి తయారవుతున్న మరెన్నో కొత్త టెక్నాలజీలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే ప్రైవేట్ సంస్థలు సైతం ఏఐను ఎదిరించే టెక్నాలజీలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ట్విటర్ సీఈఓ ఎలన్ మాస్క్ కూడా చేరారు.

- Advertisement -

ఇప్పటికే ట్విటర్‌ను తన స్వాధీనం చేసుకొని.. ఈ ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ను తనకు నచ్చినట్టుగా మార్చుకున్న ఎలన్ మస్క్.. తన ఇతర సంస్థలపై కూడా ఒక కన్నేసి ఉంచాడు. స్పేస్ ఎక్స్ నుండి కావాల్సిన పరిశోధనలను చేస్తున్నాడు. టెస్లాలో కావాల్సిన కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. అలాంటి ఎలన్ మస్క్ చూపు ప్రస్తుతం ఏఐపై పడింది. ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన చాట్‌జీపీటీ లాంటి సంచలనాన్ని తాను కూడా సృష్టించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఓపెన్ ఏఐ ఫీచర్‌తో చాట్‌జీపీటీ అనే టెక్నాలజీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది మైక్రోసాఫ్ట్. అయితే అదే ఓపెన్ ఏఐను ఉపయోగించి చాట్‌జీపీటీని ఎదిరించే కొత్త టెక్నాలజీని తయారు చేయాలని కేవలం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఒక కంపెనీ స్థాపించే ఆలోచనలో ఉన్నారట ఎలన్ మస్క్. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఎలన్ మస్క్ ఇప్పటికే అలాంటి ఒక సంస్థను స్థాపంచేశాడని కూడా ప్రచారం చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్, టెస్లా‌లోని పెట్టుబడిదారుల సాయంతోనే ఎక్స్.ఏఐ అనే సంస్థను ఎలన్ మస్క్ స్థాపించాడని సమాచారం.

2023 మార్చ్ 9న ఎక్స్.ఏఐ సంస్థ ప్రారంభయినట్టు తెలుస్తోంది. ఇది ఒక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్ లాగా ప్రారంభమయ్యింది. దీనిని ఉపయోగించి ట్విటర్ యూజర్లు ఒక ట్వీట్‌లో 10 వేల క్యారెక్టర్లను పోస్ట్ చేయవచ్చని ఎలన్ మస్క్ తెలిపాడు. దీనినే పూర్తిగా ఏఐతో డెవలప్ చేసి ఓపెన్ ఏఐ లాంటి టెక్నాలజీని తయారు చేయాలని మస్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2015లో ఓపెన్ ఏఐ తయారీ సమయంలో ఎలన్ మస్క్ కూడా అందులో భాగంగా ఉండడం గమనార్హం.

2018లో ఓపెన్ ఏఐ బోర్డ్‌ను విడిచిపెట్టిన ఎలన్ మస్క్.. అప్పటినుండి దానిపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఏఐపై, మైక్రోసాఫ్ట్‌పై ఎన్నో విమర్శలు గుప్పించాడు. అంతే కాకుండా ఏఐ అనేది మనిషి మేధస్సుకు, సమాజానికి, మానవాత్వానికి ఎప్పటికైనా ప్రమాదకరంగా మారుతుందని మస్క్ అన్నాడు. ఇప్పుడు మార్కెట్లో ఏఐ క్రేజ్‌ను చూసిన మస్క్.. తానే స్వయంగా ఒక సంస్థను స్థాపించడం అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News