E-Paper
Advertisement

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం!

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం!
Advertisement

Vijayawada Fire: విజయవాడ ఆటోనగర్‌లో ఈరోజు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని నాలుగో క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఒక పిల్లల ఆటవస్తువుల తయారీ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల ప్లాస్టిక్, ఇతర మండే స్వభావం ఉన్న ఆటవస్తువులు భారీగా నిల్వ ఉండటంతో.. మంటలు క్షణాల్లోనే గోడౌన్ మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. దీంతో స్థానికులు, పక్కనే ఉన్న పరిశ్రమల కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. గోడౌన్‌లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో తయారైన ఆటవస్తువులతో పాటు విలువైన యంత్రాలు, ముడిసరుకు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీనివల్ల సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర గోడౌన్లకు వ్యాపించకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ, మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Also Read: స్క్రిప్ట్ బీఆర్ఎస్‌ది.. ప్రజెంటేషన్ బీజేపీది.. కిషన్ రెడ్డిపై చామల ఫైర్

Tags

Related News

వైసీపీది అంతా రివర్స్ వ్యవహారం.. పట్టణాలే కాదు-పల్లెల్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చారు-సీఎం చంద్రబాబు

మామ వెనక్కి తగ్గు.. అలాంటి మాటలొద్దు, బొత్సకు మేనల్లుడు శ్రీను స్ట్రాంగ్ కౌంటర్..

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎపిసోడ్.. అమరావతి టు ఢిల్లీ, నాకు నచ్చకపోతే అక్కడే రాజీనామా

కేవలం 12 నెలల వ్యవధిలో.. ఆసియాలో అతిపెద్ద బేవరేజ్ ప్లాంట్, ఎక్స్‌లో మంత్రి లోకేష్..

వైసీపీ చ‌నిపోయిన పార్టీ.. బ్రతికున్నామనే భ్రమలో ఆ పార్టీ నేతలు, నాగబాబు హాట్ కామెంట్స్‌పై చర్చ

సీఎం చంద్రబాబుతో భేటీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జెడ్సీ పదవిపై చర్చ, నెక్ట్స్ అడుగులు ఎటువైపు?

ప్రమాదానికి గురైన పెళ్లి కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, కొత్త దంపతులకు గాయాలు, ప్రకాశం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×