Second Hand Mobiles : ప్రస్తుతం వేగంగా మారుతున్న స్మార్ట్‌ఫోన్ యుగంలో సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ను కస్టమర్స్ కొంటూనే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ను సైతం కొనుగోలు చేస్తున్నారు. అయితే డబ్బు ఆదా చేయాలన్నా, ఎప్పుడో ఆపేసిన మెుబైల్ ను కొనాలనుకున్నా ఇది మంచి నిర్ణయం. అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి.
ఇప్పటికే ఉపయోగించిన ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే ముందు పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఫోన్ పరిస్థితిని పరిశీలించడం, పనితీరు, బ్యాటరీ సామర్థ్యాలను అంచనా వేయాలి. మీ ఉపయోగాలకు తగినట్లు ఫోన్ ను ఎంచుకోవాలి. ఉదాహరణకు ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్నవారు కెమెరా క్వాలిటీ, పనిచేసే తీరును సరిచూసుకోవాలి. ఎక్కువ సమయం ఫోన్ వాడేవారు బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. తక్కువ ధరకే ఫోన్ కొనాలి అనుకున్న వారు బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి.
ఫోన్ కండీషన్ : స్మార్ట్‌ఫోన్ భౌతిక పరిస్థితిని కరెక్ట్ గా అంచనా వేయాలి. ఫోన్ పై గీతలు, స్క్రీన్‌లో ఏవైనా పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. అన్ని పోర్ట్స్, బటన్స్ పని తీరు సరి చూసుకోవాలి. ఆ ఫోన్ విడుదల తేదీ, వినియోగించిన కాలంను చూసుకోవాలి. ఇక పాత ఫోన్స్ కొన్ని కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు లేదా యాప్‌లకు మద్దతు ఇవ్వవనే విషయం గుర్తించాలి.
బ్యాటరీ కండిషన్ : ఎలాంటి ఇబ్బందిలేకుండా స్మార్ట్ ఫోన్ మన్నిక రావాలంటే బ్యాటరీ లైఫ్ ముఖ్యమైన అంశం. ఇక బ్యాటరీ పరిస్థితిని అడగాలి. కాలక్రమేణా బ్యాటరీ లైఫ్ తగ్గింపోతుందా అనే విషయాన్ని గుర్తించాలి. ఫోన్ తాజా సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను అమలు చేయగలదో లేదో తనిఖీ చేయాలి.
ధర : ఫోన్ మోడల్ మార్కెట్ విలువను చూడాలి. మంచి డీల్ అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. వీలైతే నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్ ను కొనుగోలు చేయాలి. తెలియని వ్యక్తులు లేదా సందేహాస్పద వెబ్‌సైట్‌లతో లావాదేవీలు చేయడం మానుకోవాలి. దీని వలన నష్టపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.
పనితీరు : యాప్స్ రన్ చేయాలి. ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయాలి. ఫోన్ ఎలా పని చేస్తుందో చూడటానికి కెమెరా నాణ్యతను తనిఖీ చేయాలి. స్టోరేజ్ కెపాసిటీని చెక్ చేసుకోవాలి. ఫోటోలు, వీడియోలు, యాప్‌లను ఫోన్ స్టోర్ చేయగలదా లేదా అనే విషయాన్ని చెక్ చేయాలి.
నెట్‌వర్క్ : ఫోన్ మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌తో అనుకూలంగా ఉందో లేదా అనే విషయాన్ని చెక్ చేయాలి. అన్‌లాక్ చేసి ఉంటే లాక్ తీయించాలి. ఇక కొన్ని ఫోన్‌లు క్యారియర్ – లాక్ చేయబడి ఉంటాయి. ఈ విషయాన్ని సరిచూసుకొని అదనంగా, ఫోన్ దొంగిలించబడలేదని గుర్తించాలి. ఒకవేళ ఫోన్ బ్లాక్‌లిస్ట్ లో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. దాని IMEI నంబర్‌ను నిర్ధారించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈఎమ్ఐ లేదా చట్టపరమైన ఇబ్బందులు ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాసే అవకాశం ఉండదు.
ALSO READ : వన్ ప్లస్ 13 లాంఛ్ డేట్ లీక్.. పెద్ద బ్యాటరీతో పాటు హై స్టోరేజ్.. ఇంకా ఎన్నో పిచ్చెక్కించే ఫీచర్స్!