Diljit Dosanjh : ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) కు తాజాగా తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పాటలు పాడొద్దు అంటూ తాజాగా సదరు సింగర్ ను నోటీసులు జారీ చేసింది. అసలు దిల్జిత్ దోసాంజ్ కు టీఎస్ ప్రభుత్వం ఇలాంటి నోటీసులు ఎందుకు పంపిందో తెలుసుకుందాం పదండి.
పాపులర్ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) తన “దిల్-లుమినాటి టూర్”లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రదర్శనలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రదర్శన ఎక్కడ జరుగుతున్నా సరే మ్యూజిక్ లవర్స్ భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ షోలో మునిగి తేలుతున్నారు . ఇక ఇప్పుడు ఆయన మ్యూజిక్ షో హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. నవంబర్ 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్న దిల్జిత్ దోసాంజ్ సంగీత కాన్సర్ట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
జీఎంఆర్ ఎరీనాలో జరిగే దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) కార్యక్రమంలో మద్యం, మాదక ద్రవ్యాలు లేదా హింసను ప్రోత్సహించే ఎలాంటి పాటలను ప్రదర్శించకుండా దోసాంజ్ కు ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై తెలంగాణలో ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) మ్యూజిక్ కాన్సర్ట్ లో డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి ప్రమోట్ చేస్తున్నట్టు వీడియో సాక్ష్యాలతో చండీగఢ్ నివాసి కంప్లయింట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ కంప్లయింట్ ను దృష్టిలో పెట్టుకుని దిల్జిత్ దోసాంజ్ కు ఈ ఆదేశం అందినట్టు తెలుస్తోంది. పాటల కంటెంట్‌పై పరిమితులతో పాటు, కచేరీ సమయంలో పిల్లలను వేదికపైకి అనుమతించకూడదని కూడా నోటీసులో ప్రభుత్వం ఆదేశించింది. 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వని స్థాయిలు పిల్లల ఆరోగ్యానికి హానికరం అని సూచిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఆ నోటీసులో పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) నవంబర్ 15న జరగనున్న తన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దిల్-లుమినాటి మ్యూజిక్ కాన్సర్ట్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. నవంబర్ 13నే హైదరాబాద్ కు వచ్చిన ఆయన తన కాన్సర్ట్ స్టార్ట్ కావడానికి ముందు హైదరాబాద్‌లోని కొన్ని ఐకానిక్ స్పాట్‌లను సందర్శించారు. అందులో భాగంగా ఆయన ఛార్మినార్ ను కూడా విజిట్ చేశారు.
కాగా దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) హైదరాబాద్ మ్యూజిక్ కాన్సర్ట్ నవంబర్ 15న సాయంత్రం జీఎంఆర్ ఎరీనాలో జరగబోతోంది. ఇదిలా ఉండగా దిల్జిత్ దోసంజ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కల్కి’ (Kalki 2898 AD) మూవీలో స్పెషల్ సాంగ్ ను పాడిన సంగతి తెలిసిందే. ‘కల్కి యాంతమ్’ వీడియో సాంగ్ లో ప్రభాస్ (Prabhas), దిల్జిత్ దోసంజ్ ఇద్దరూ పంజాబీ డ్రెస్ లో అదరగొట్టారు. ఇక దిల్జిత్ దోసంజ్ సౌత్ లో సాంగ్ పాడడం ఇదే మొదటిసారి. ఇప్పుడు డైరెక్ట్ గా దిల్-లుమినాటి మ్యూజిక్ కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు.