BigTV English

Ev-china : ఈవీ బ్యాటరీ @ 1000 కిలోమీటర్లు!

Ev-china : ఈవీ బ్యాటరీ @ 1000 కిలోమీటర్లు!

Ev-china : లూసిడ్ ఎయిర్.. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక దూరం ప్రయాణించగల ఎలక్ట్రిక్ కార్. కాలిఫోర్నియాకు చెందిన లూసిడ్ మోటార్స్ తయారు చేసిన టాప్ సెడాన్ ఎయిర్ గ్రాండ్ రేంజ్ ఏకంగా 830 కిలోమీటర్లు. దానిని తలదన్నే రీతిలో చైనా ఈవీ కంపెనీ సరికొత్త బ్యాటరీని అభివృద్ధి చేసింది. దాని రేంజ్ ఎంతో తెలుసా?


ఒక్కసారి చార్జి చేస్తే.. 1000 కిలోమీటర్ల వరకు నిరాటంకంగా ప్రయాణించేయొచ్చు. డ్రాగన్ దేశంలో టెస్లాకు ప్రత్యర్థిగా నియో గట్టి సవాల్ విసురుతోంది. ఈవీ కార్ల తయారీలో ఎలాన్ మస్క్‌కు ఎంత పేరుందో.. నియో సంస్థ సీఈవో విలియం లీ కూడా అంతటి ప్రముఖుడు. కార్ల తయారీలోనే కాకుండా.. అత్యధిక రేంజ్ ఇచ్చే బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపైనా నియో సంస్థ ఆసక్తి చూపుతోంది.

ఆ సంస్థ ప్రోడక్ట్ నియో ఈటీ7 ఎలక్ట్రిక్ వెహికల్‌పై 150 kWh సామర్థ్యం గల కొత్త బ్యాటరీని ఆయన స్వయంగా పరీక్షించారు. ఆ కారుపై ఏకబిగిన 14 గంటల పాటు డ్రైవింగ్ చేశారు. డిసెంబర్ 17న షాంఘై నుంచి జియామిన్(xiamen) తీర నగరానికి ఝామ్మంటూ దూసుకెళ్లిపోయారు. 1044 కిలోమీటర్లు ప్రయాణించినా.. నియో ఈటీ7 బ్యాటరీలో ఇంకా 3% చార్జింగ్ మిగిలే ఉంది. ఎలక్ట్రిక్ కార్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక రేంజ్ అని విలియం లీ వెల్లడించారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని ఆయన లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం మరో విశేషం.


కొత్త ఏడాదిలో ఏప్రిల్ నెల నుంచి 150 kWh బ్యాటరీలను భారీ ఎత్తున తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది నియో. అయితే ఖరీదు కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. బ్యాటరీ ఒక్కటే 42,100 డాలర్ల వరకు ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది. మన కరెన్సీలో చెప్పాల్సి వస్తే.. రూ.35 లక్షలకు పై మాటే. చైనాలో టెస్లా మోడల్-వై కారు బ్యాటరీ ధర కూడా దాదాపు అంతే మొత్తం ఉంటుంది.

అమ్మో.. ఇంత ధరా? అని బెంబేలు పడాల్సిన అవసరం లేదు. ఆ బ్యాటరీ లేకుండానే కార్లను విక్రయించేందుకు నియో సిద్ధమైంది. ఇందుకోసం నియో నెట్‌వర్క్‌ నుంచి వినియోగదారులు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నెట్‌వర్క్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా బ్యాటరీ స్వాప్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా స్టేషన్లలో డెడ్ బ్యాటరీలకు బదులు పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీలను మార్చుకోవచ్చు.

Related News

Smartphone Comparison: షావోమీ 17 ప్రో మాక్స్ vs ఐఫోన్ 17 ప్రో మాక్స్.. ఫ్లాగ్‌షిప్ దిగ్గజాల పోటీ

Shai-Hulud virus: ఐటీ కంపెనీలపై సైబర్ దాడులు.. ప్రభుత్వ హెచ్చరిక.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

iPhone 17 cheaper: ఐఫోన్ 16 కంటే ఐఫోన్ 17 తక్కువ ధరకు.. కొత్త మోడల్‌పై ఎక్కువ డిస్కౌంట్!

Vivo vs Realme Comparison: ఫోన్లలో ఎవరు విన్నర్? ఏ ఫోన్ వాల్యూ ఫర్ మనీ? షాకింగ్ రిజల్ట్!

Motorola vs Redmi comparison: మోటరోలా vs రెడ్‌మీ అసలైన కింగ్ ఎవరు? బడ్జెట్ ఫోన్లలో బెస్ట్ ఎవరు?

WhatsApp Status: వాట్సాప్ స్టేటస్ కొత్త ట్రిక్.. టార్గెట్ కాంటాక్ట్ తప్పక చూడాలంటే ఇలా చేయండి

Toyota Car 2025: కొత్త టయోటా కరోల్లా క్రాస్ రాయల్ టచ్! ఇంత స్టైలిష్‌గా ఎప్పుడూ చూడలేదేమో

Infinix Note launched: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ప్లస్ లాంచ్.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో గ్రాండ్ ఎంట్రీ!

Big Stories

×