Gmail : అఫీషియల్ జీమెయిల్ ను ఏళ్ల తరబడి ఉపయోగించే వారికి ఎదురయ్యే మొదటి సమస్య అవసరమైన మెయిల్ ను వెంటనే కనుగొనలేకపోవటం. ఇక కావల్సిన జీమెయిల్ ను వెంటనే వెతకటం కష్టమే అయినప్పటికీ కొన్ని స్టెప్స్ ఫాలో అయితే ఎన్నేళ్ల క్రితం ఈ మెయిల్ అయినా ఇట్టే పట్టేయొచ్చు.
జీమెయిల్.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో వినియోగదారులు ఉపయోగిస్తున్న మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్లాట్ ఫామ్. ఈ జీమెయిల్ కు ఒక్క ఇండియాలోనే దాదాపు 350 మిలియన్ యూజర్స్ ఉన్నారు. ఇది ఇండియాలో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 62%గా ఉంది. ఈ జీమెయిల్.. ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఇన్ని కోట్ల మంది ఉపయోగించే జిమెయిల్ తో ఎదురయ్యే ప్రధాన సమస్య అవసరమైన మెయిల్ ను వెంటనే కనుక్కోలేకపోవడం ఈ సమస్య చాలా మందికి ఎదురవుతూనే ఉంటుంది ముఖ్యమైన మెయిల్ లో కనుక్కోవాలంటే ఉన్న మెయిల్స్ అన్ని స్క్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మెయిల్ లో కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.
ఉదాహరణకు ఐదేళ్ల క్రితం మెయిల్స్ మీకు కావాలనుకుంటే తేలిగ్గా పొందే ఛాన్స్ ఉంటుంది ఎందుకోసం ఇప్పటివరకు ఉన్న మెయిల్స్ అన్ని స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు కేవలం కొన్ని స్టెప్స్ ఫాలో అయితే నీ పని మరింత తేలిక అయిపోతుంది.
Gmailలో పాత ఈ మెయిల్‌లను కనుక్కోటానికి ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు.
STEP 1 : Gmailలో పాత ఈ మెయిల్‌లను వెతకటానికి ముందు Gmail యాప్ ఓపెన్ చెయ్యాలి.
STEP 2 : పాత మెయిల్స్ వెతకటానికి సర్చ్ బార్ కి వెళ్లాలి.
STEP 3 : ఎన్ని సంవత్సరాల క్రితం పాత మెయిల్‌ను వెతకాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి
STEP 4 : ఒకవేళ 5 సంవత్సరాల క్రితం పాత మెయిల్‌ని శోధించాలనుకుంటే, Gmail సర్చ్ లో Older_Than : 5y అని టైప్ చేయాలి. ఏ పాత మెయిల్‌ను సర్చ్ చేయాలనుకున్నా.. Older_Than : అని టైప్ చేసి… ఆపైఎన్ని ఇయర్స్ బ్యాక్ మెయిల్ కావాలో సర్చ్ చేయాలి.
STEP 5 : ఇలా సర్చ్ చేస్తూ మీరు దాదాపు 5 ఏళ్ల క్రితం వరకూ మెయిల్స్ కూడా ఇట్టే పట్టేసే ఛాన్స్ ఉంటుంది.
ALSO READ : రూ.20వేలలోపే 108MP కెమెరా ఫోన్స్ ఏమున్నాయ్ భయ్యా! టాప్ 3 ఆఫ్షన్స్ ఇవే!