108 MP Camera Phones Under 20K : బెస్ట్ కెమెరా మొబైల్ కొనాలనుకుంటున్నారా? రూ.20 వేలలోపే కావాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం.. టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ అతి తక్కువ ధరకే బెస్ట్ కెమెరా మొబైల్స్ ను తీసుకొచ్చేసాయి. మరి వీటిలో టాప్ ఆప్షన్ ఏంటో చూసెద్దాం.
ఫోటో ప్రియుల కోసం టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఇప్పటి వరకూ ఎన్నో బెస్ట్ మొబైల్స్ ను లాంఛ్ చేశాయి. ఇందులో రూ. 20వేలలోపే బెస్ట్ ఫీచర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది విడుదలైన మొబైల్స్ లో హై క్వాలిటీ కెమెరా మొబైల్స్ ఎన్నో ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఫ్లాగ్ షిప్, ప్రీమియం ఫోన్సే ఉన్నాయి. వీటిలో బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో 200MP కెమెరా మెుబైల్స్ ఎన్నో ఉన్నప్పటికీ… వీటి ధర కాస్త ఎక్కువనే చెప్పాలి. కాగా బడ్జెట్ లోనే బెస్ట్ కెమెరా మొబైల్స్ కొనాలనుకుంటే ఆప్షన్స్ కాస్త తక్కువగానే ఉన్నాయి. మరి ఇందులో టాప్ 3 ఆప్షన్స్ ఏంటో ఓసారి చూసెద్దాం.
HONOR 200 Lite 5G – HONOR 200 Lite 5G మెుబైల్ 108MP మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ సెటప్ తో వచ్చేసింది. ఈ మెుబైల్ కెమెరా ఫొటోగ్రఫీ ప్రియులకు బెస్ట్ ఆఫ్షన్. అద్భుతమైన ఫోటోగ్రఫీ విజువల్స్ ను ఈ ఫోన్ తో క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,998. ఈ మెుబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ తో ఈఎమ్ఐ సదుపాయం కూడా కలదు. రూ. 1000 తక్షణ తగ్గింపు కుడా ఉంది. ఇక ఈ కెమెరాలో ఆటో సీన్ రికగ్నిషన్, ఇమేజ్ ఆప్టిమైజేషన్, AI సపోర్టెడ్ ఇన్‌స్టంట్ మూవీ మేకర్ ఫీచర్స్ తో పాటు వైడ్ యాంగిల్స్‌కు AI సపోర్టెడ్ ఆటో అడ్జస్టింగ్ వంటి ఫీచర్స్ సైతం ఉన్నాయి.
Redmi Note 13 5G – ఈ Redmi Note 13 5G మెుబైల్ లో 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 15,162గా ఉంది. ఇక ఇందులో 108MP 3X ఇన్ సెన్సర్ జూమ్, AI ట్రిపుల్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ కెమెరాలో డెప్త్ కంట్రోల్, మాక్రో, ప్రో మోడ్, డాక్యుమెంట్ స్కానర్, పనోరమా, హెచ్‌డిఆర్, గూగుల్ లెన్స్ బిల్ట్ ఇన్, వాయిస్ షట్టర్‌తో AI పోర్ట్రెయిట్ మోడ్ వంటి అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి.
OnePlus Nord CE 3 Lite 5G – ఈ OnePlus Nord CE 3 Lite 5G మెుబైల్ లో EISతో 108 MP ప్రధాన కెమెరాతో వచ్చేసింది. 2MP డెప్త్ అసిస్ట్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3x లాస్‌లెస్ జూమ్, ఫోటో, వీడియో, నైట్‌స్కేప్, ఎక్స్‌పర్ట్, పనోరమిక్, పోర్ట్రెయిట్, మాక్రో, టైమ్ లాప్స్, స్లో మోషన్, లాంగ్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ వీడియో, టెక్స్ట్ స్కానర్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇక 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.15,380
ALSO READ : ఇస్రో మరో ప్రయోగం.. నింగిలోకి PSLV-C60 రాకెట్