BigTV English

Kamareddy news : ఇది దగ్గు మందు కాదు.. ప్రమాదకర మత్తు పదార్థం. మీ దగ్గర దొరికిందా.. నేరుగా జైలుకే..

Kamareddy news : ఇది దగ్గు మందు కాదు.. ప్రమాదకర మత్తు పదార్థం. మీ దగ్గర దొరికిందా.. నేరుగా జైలుకే..

Kamareddy news : కామారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున నిషేధిత మత్తు పదార్థాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దగ్గర పడుతున్న వేళ.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, రాజధాని హైదరాబాద్ కు తరలిస్తున్న నిషేధిత డ్రగ్స్, మత్తు పదార్థాలు, అక్రమ మద్యం బయటపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో బయటపడిన అల్ఫాజోలం టాబ్లెట్లు, కోడిన్ సిరప్ కేసుతో.. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగంపై ఆందోళన కలిగిస్తోంది.


సాధారణంగా ఇవి వైద్య రంగానికి చెందిన ట్యాబ్లెట్లు, సిరప్.. వీటిని దగ్గ మందులా వినియోగిస్తుంటారు. ఇవి పొడి దగ్గు మరియు ఛాతీ దగ్గును తగ్గించేందుకు పనికొస్తుంది. ఇందులో క్లోర్ఫెనిరమైన్ , డెక్స్ట్రోమెథోర్ఫాన్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి పరిమిత మోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు, కానీ.. అధికంగా తీసుకుంటే మాత్రం మత్తును కలిగిస్తుంటుంది. ఈ కారణంగానే అనేక మంది యువత.. ఈ టాబ్లెట్లు, సిరప్ లను మత్తు కోసం వినియోగిస్తుంటారు.

బయట గంజాయి, ఇతర మత్తు పదార్థాలను కొనుగోలు చేయడం కాస్త కష్టమైన పని. ఈకారణంగానే.. చాలా మంది యువత, కొత్తగా మత్తుకు బానిసగా మారిన వాళ్లు ఈ ఔషధాల్ని కొనుగోలు చేసి మత్తు కోసం వాడుతుంటారు. వీటిని అధిక మోతాదులో వినియోగించినా, వైద్యులు సూచించిన మోతాదు కంటే ఎక్కువ డోస్ తీసుకున్నా.. మనిషిపై చెడు ప్రభావం పడుతుంది. వీటికి అలవాటు పడినవారు.. రోజూ ఈ మందుల్ని తీసుకుని మత్తులో తూగిపోతుంటారు. ఇవి లేకపోతే.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు.


అల్ఫాజోలం టాబ్లెట్లను పొడిలా చేసి మత్తు పదార్థాలు పీల్చినట్లుగా పీల్చుతుంటారు. కొడిన్ సిరప్ ను మాత్రం నేరుగా తీసుకుని.. మత్తులో మునిగిపోతుంటారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వాలు.. ఈ టాబ్లెట్లు, సీరప్ ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అయినా.. అక్రమ సంపాదనకు అలవాటు పడిన చాలా మంది ఈ మత్తు పదార్థాలను దొంగ చాటుగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక యువతకు మత్తు పదార్థాలను చేతిలో పెట్టి జేబులు నింపుకుంటున్నారు.

ఈ నిషేధిత మత్తు పదార్థాల సరఫరాకు సంబంధించిన సమాచారం అందడంతో కామారెడ్డి జిల్లా మంగిడి ఆర్డీఓ చెక్ పోస్ట్ దగ్గర ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో ఓ కారులో అనుమానాస్పద మెడిసిన్ ఉండటాన్ని గుర్తించి తనిఖీలు చేయగా.. ఏకంగా రూ.56.23 లక్షల విలువైన ఆల్ఫా జోలం, నిషేధిత కోడిన్ సిరప్ బయటపడింది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. సోదాల్లో 7,500  ఆల్ఫాజోలం టాబ్లెట్లు బయటపడగా, 150 బాటిల్స్ నిషేధిత కోడిన్ సిరప్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.56.23 లక్షలు గా అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. రూ. 40 లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై నిషేధిత డ్రగ్స్ సరఫరా కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించనున్నట్లు కామారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ డి.శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నిషిద్ధ డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడంతో.. పోలీసులు సైతం ప్రత్యేక శ్రద్ధ పెట్టి డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న పోలీసులు.. ఈ కేసుల్లో పట్టుబడితే కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. ఎట్టి పరిస్థితులలో డ్రగ్స్ వినియోగానికి, సరఫరాకు దూరంగా ఉండాలని, అలాంటి సాహసాలు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.

Also Read : చేతిలోనే బాంబు పేల్చేశాడు.. ప్రియురాలి ఇంటి ముందు యువకుడు ఆత్మహత్య

డ్రగ్స్ వినియోగం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతో ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు జరగకూడదని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పైగా నూతన సంవత్సర వేడుకలు సైతం ఉండటంతో పోలీసుల తనిఖీలు మరింతగా పెరిగాయి.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×