Medak District: ఉమ్మడి మెదక్ జిల్లాలో ముసుగు దొంగలు హల్ చల్ సృష్టిస్తున్నారు. తరుచుగా ఎక్కడో ఓ చోట దొంగలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. దొంగల భయంతో ఉమ్మడి జిల్లా ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. రాత్రి వేళ గ్రామాలలోని షాపులను, రైస్ మిల్లులను టార్గెట్ చేసుకొని దొంగతనానికి పాల్పడతున్నారు. తరుచుగా ఎక్కడో ఓ చోట దొంగతనాలు జరుగుతూ ఉన్నా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు. రక్షణ పరమైన విషయాల్లో సరైన భద్రత లేకపోవడంతో జిల్లాలో దొంగతాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
నిన్న రాత్రి మెదక్ జిల్లాలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ముసుగు దొంగలు కత్తులు పట్టుకొని హల్చల్ సృష్టించారు. జిల్లాలోని కొల్చారం మండలం రాంపూర్ గ్రామ సమీపంలోని అన్నపూర్ణ రైస్ మిల్లులో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. రైస్ మిల్ షెటర్ ఎత్తి దొంగలు రూ.40 వేల చోరీకి పాల్పడ్డారు. అక్కడే నిద్రిస్తున్న వాచ్ మెన్ నారాయణ సెల్ ఫోన్ సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. రైస్ మిల్ యజమాని మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లేశం ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రాత్రి సమయంలో పోలీసులు నగారాల్లో, మండలాల్లో , గ్రామాల్లో పెద్దగా పెట్రోలింగ్ నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. రోజుకు ఒక పోలీసు అధికారి విధులు నిర్వర్తించాలని నిబంధన ఉన్నప్పటకీ మండలాల్లో, గ్రామాల్లో పెద్దగా అమలు చేయడం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని.. గ్రామాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Staff Nurse Recruitment: ఆ జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే..
జిల్లాలో దొంగతనాలు జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో దొంగతనాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు దొంగలను గుర్తిస్తే.. ఇక ఇలాంటి సంఘటన జరగయని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.