BigTV English

iPhone Offers: ఏంటి భయ్యా ఇది.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఐఫోన్‌లపై వేలల్లో డిస్కౌంటా? అతిపెద్ద ఆఫర్ అంటే ఇదే!

iPhone Offers: ఏంటి భయ్యా ఇది.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఐఫోన్‌లపై వేలల్లో డిస్కౌంటా? అతిపెద్ద ఆఫర్ అంటే ఇదే!

iPhone Price Drop: ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్లిప్‌‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 మరో రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది. ఇది సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 26న అందుబాటులోకి రానుంది. దీనికోసం ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఐఫోన్ పై ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్‌లో ఐఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఎవరూ ఊహించని.. ఎవరి ఊహకు అందని ఆఫర్లు ఈ సేల్‌లో పొందొచ్చు.


ఈ సేల్‌లో కస్టమర్లు ఐఫోన్ 13ను చాలా తక్కువకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.79,900 ఉండగా ఇప్పుడు ఈ సేల్‌లో కేవలం రూ.37,999లకి కొనుక్కోవచ్చు. అయితే సేల్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి.. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,900కి లభిస్తుంది. ఈ ఫోన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. గత సంవత్సరం ఐఫోన్ 15 ప్రోతో పాటు ఐఫోన్ 15 ప్రో మాక్స్, యాపిల్ వాచ్ సిరీస్ 9 లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ సేల్‌లో iPhone 15 Pro, iPhone 15 Pro Max ధర రూ. 1 లక్ష లోపే ఉంటుంది.

Also Read: ఐఫోన్, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మి ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఊహించలేరు భయ్యా!


ఈ స్మార్ట్‌ఫోన్‌లపై నార్మల్ డిస్కౌంట్‌తో పాటు, ఎంపిక చేసిన బ్యాంకుల కార్డ్‌లు, EMI ట్రాన్సక్షన్లపై కూడా ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఇది కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు సైతం లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఐఫోన్ 16 ఇటీవలే లాంచ్ అయింది. ఈ లాంచ్ తర్వాత భారతదేశంలో iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్‌ల అమ్మకాలను ఆపిల్ నిలిపివేసింది. అయితే ఈ ఫోన్‌లు Apple వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు. కానీ థర్డ్-పార్టీ రిటైలర్‌లు లేదా refurbished స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఇక వీటి ధరలు, తగ్గింపు ఆఫర్ల విషయానికొస్తే.. iPhone 15 Pro 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,09,900 గా ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.89,999లకి కొనుక్కోవచ్చు. అదే సమయంలో iPhone 15 Pro Max వేరియంట్ ధర రూ. 1,34,900గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.99,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఎంపిక చేసిన బ్యాంకుల EMI ట్రాన్సక్షన్ల ద్వారా చేసే కొనుగోళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను కూడా పొందొచ్చు. దీంతో ఈ ఐఫోన్లను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మరింత తక్కువ ధరకు కొనుక్కోవడం జరుగుతుంది.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×