PM MODI: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ (ICC Womens World Cup 2025) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన టీమిండియా, తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. అయితే టీమిండియా ఛాంపియన్ అయిన నేపథ్యంలో మహిళల జట్టుకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi). బుధవారం రోజున టీమిండియా మహిళా క్రికెటర్లు… ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా టీమిండియా మహిళా క్రికెటర్లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించి, సత్కరించారు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
మహిళ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ గెలిచిన నేపథ్యంలో.. టైటిల్ తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లారు మహిళా క్రికెటర్లు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆ టైటిల్ టచ్ చేయలేదు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, లేడీ కోహ్లీ స్మృతి మందాన ఇద్దరు మాత్రమే టైటిల్ పట్టుకోగా, మధ్యలో ఉన్న నరేంద్ర మోడీ మాత్రం వాళ్ల చేతులు పట్టుకున్నాడు. టైటిల్ మాత్రం టచ్ చేయలేదు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మహిళలు ఎంతో కష్టపడి గెలుచుకున్న టైటిల్ కు గౌరవం ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని టచ్ కూడా చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం టైటిల్ ను ముట్టుకోకుండా అవమానించాడని ఫైర్ అవుతున్నారు. గతంలో 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచినప్పుడు కూడా ట్రోఫీ టచ్ చేయలేదు మోడీ. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ మాత్రమే ట్రోఫీని పట్టుకోగా, వాళ్లిద్దరి చేతులు మాత్రమే ముట్టుకున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే 2024 సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని వ్యవహారంపై ఎవరూ రియాక్ట్ కాలేదు కానీ.. ఇప్పుడు మాత్రం స్పందిస్తున్నారు. టీమిండియా ప్లేయర్లు సాధించిన టైటిల్ కు గౌరవం ఇస్తూ, మోడీ అలా వ్యవహరించాడని కామెంట్స్ చేస్తున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు భారీ నజరానా దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలింగ్ నుంచి ఏకంగా 40 కోట్లు టీమిండియాకు దక్కాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు ఏకంగా 51 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది బీసీసీఐ (BCCI). అటు సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి..టీమిండియా ప్లేయర్లకు నెక్లెస్ లు కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
PRIME MINISTER NARENDRA MODI HAVING A FUN CHAT WITH WORLD CUP WINNING INDIAN TEAM. 👌 pic.twitter.com/3DxQVfmKJ4
— Johns. (@CricCrazyJohns) November 6, 2025