Vishnu Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో… హీరోగా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఇటు నిర్మాతగా కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే తనపైన అపనమ్మకంతో ఏకంగా తన సినిమాకు 21 మంది నిర్మాతలు మారారని.. కానీ వారి నమ్మకం లేనితనం తనను నిర్మాతగా మార్చి సక్సెస్ అయ్యేలా చేసింది అని చెప్పి ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ఆర్యన్’. ఇప్పటికే తమిళంలో విడుదల అయ్యి.. అక్కడ మంచి విజయాన్ని అందుకొని.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఇందులో పాల్గొన్న విష్ణు విశాల్ మాట్లాడుతూ.. “అందరూ అనుకుంటున్నట్టు నా నట ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నేను ఎంపిక చేసుకున్న కథలు తెరపైకి రావడం వెనుక ఎవరూ ఊహించని కష్టం ఉంది. గతంలో నేను నటించిన రాచసన్ సినిమాకి ఏకంగా 21 మంది నిర్మాతలు మారారు. మట్టి కుస్తీ సినిమాకి ఆరుగురు, ఐఎఫ్ఐఆర్ చిత్రానికి ముగ్గురు, జీవా చిత్రానికి ముగ్గురు నిర్మాతలు మారారు. అందుకే ఇక ఇదంతా కుదరదు అని చెప్పి.. నేనే నిర్మాతగా మారాను. ప్రస్తుతం నా కొత్త సినిమా ఆర్యన్ కి కూడా నేను నిర్మాతగా చేస్తున్నాను. అయితే ఈ అన్ని చిత్రాలు కూడా నాకు లాభాలు తెచ్చిపెట్టాయి” అంటూ ఆర్యన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు
ALSO READ:NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!
ఆర్యన్ సినిమా విషయానికి వస్తే.. విష్ణు విశాల్ హీరోగా.. ప్రవీణ్ కె దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్ . ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath), మానస చౌదరి (Manasa Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలీవుడ్లో హిట్ అయిన రాచసన్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి థ్రిల్ అందించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో రాక్షసుడు అంటూ రిలీజ్ చేయగా అనుపమ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటించారు. ఇప్పుడు ఆర్యన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విష్ణు విశాల్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ తెలుగులో అందుకుంటారో చూడాలి.