BigTV English

Amazon Great Indian Festival Sale 2024: ఐఫోన్, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మి ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఊహించలేరు భయ్యా!

Amazon Great Indian Festival Sale 2024: ఐఫోన్, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మి ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఊహించలేరు భయ్యా!

Amazon Great Indian Festival Sale 2024: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులంతా ఇప్పుడు అమెజాన్‌ కొత్త సేల్ కోసం ఎంతో ఆసక్తాగా ఎదురుచూస్తున్నారు. ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సెప్టెంబర్ 27న ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024’ను ప్రారంభించనుంది. ఈ సేల్ ప్రైమ్ మెంబర్ల కోసం ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26న అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో కస్టమర్లు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ధర తగ్గింపుతో పాటు సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో సహా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ సేల్ ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులు సమయం ఉన్నందున అమెజాన్‌ కొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్‌లను వెల్లడించింది. ఇప్పుడు వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఐఫోన్ 13

ఐఫోన్‌ అంటే అందరికీ ఇష్టమే. లైఫ్‌లో ఒక్కసారి అయినా ఐఫోన్ వాడాలని ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా కొనేందుకు కాస్త జంకుతారు. అలాంటి వారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగానే తన రాబోతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఐఫోన్ 13 ను భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చని తెలిపింది. దీని అసలు ధర రూ. 79,900 ఉండగా ఇప్పుడు సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 37,999లకి కొనుక్కోవచ్చని తెలిపింది. కాగా ఇంకా సేల్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.49,900కు అందుబాటులో ఉంది.


షియోమి 14

Xiaomi 14 స్మార్ట్‌ఫోన్‌ని సైతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.69,999లకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు అమెజాన్ సేల్‌లో రూ. 47,999కి కొనుక్కోవచ్చు. Xiaomi 14 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది 4610 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.36 అంగుళాల డిస్‌ప్లేను అమర్చారు.

 Also Read: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా

Samsung Galaxy S23 Ultra స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ సేల్‌లో చాలా తక్కువకు కొనుక్కోవచ్చు. గత సంవత్సరం దీని 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,24,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు సేల్ సమయంలో దీనిని రూ. 69,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ఈ తగ్గింపులో బ్యాంక్ డిస్కౌంట్లు, ఇతర డిస్కౌంట్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ

అంతేకాకుండా Samsung Galaxy M35 5G అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సందర్భంగా రూ. 13,749కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.60 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

వన్‌ప్లస్ 12 ఆర్

OnePlus 12R స్మార్ట్‌ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్‌ని రూ.35,249కి కొనుక్కోవచ్చు. కాగా ప్రస్తుతం ఇది రూ. 42,999కి అందుబాటులో ఉంది. సేల్ సమయంలో బ్యాంక్ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. OnePlus 12R ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ అందించారు.

రియల్‌మి 70ఎక్స్ 5జీ

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భాగంగా Realme 70x 5Gను సైతం తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం రూ. 11,249కి అందుబాటులో ఉంటుంది.

Related News

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Windows 10 Support Ends: విండోస్ 10 సపోర్ట్ త్వరలోనే ముగింపు.. సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇలా పొందాలి

Whatsapp Guest Feature: అకౌంట్ లేకుండానే వాట్సాప్ మేసేజ్ పంపించవచ్చు.. ఎలాగంటే?

Samsung Truck Stolen: రూ 100 కోట్ల స్మార్ట్‌ఫోన్లు చోరీ.. 12000 శామ్‌సంగ్ డివైస్‌లు ఉన్న ట్రక్కు మాయం

Big Stories

×