BigTV English

MP Ravikishan: హిందువులకు గొడ్డుమాంసం లడ్డూలు.. రేసుగుర్రం మద్దాలి శివారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MP Ravikishan: హిందువులకు గొడ్డుమాంసం లడ్డూలు.. రేసుగుర్రం మద్దాలి శివారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MP Ravikishan Comments on Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఓ వైపు ఏపీ డిప్యూసీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష.. మరోవైపు తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం, ఇంకోవైపు ప్రకాష్ రాజ్ విమర్శలతో.. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం తారాస్థాయికి చేరింది. దీనిపై గల్లీ నేతల నుంచి ఢిల్లీ నేతల వరకూ అందరూ తమదైన రీతిలో స్పందిస్తున్నారు.


తాజాగా గోరఖ్ పూర్ ఎంపీ రవికిషన్ (రేసుగుర్రం మద్దాలి శివారెడ్డి) తిరుమల లడ్డూ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్థంతి వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న ఆయన.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. నాడు టీటీడీ ఆలయాలన్ని నడిపినవారు హిందువులు కాదని, వారి హయాంతో తిరుమలకు వచ్చిన భక్తులకు గొడ్డుమాంసంతో చేసిన లడ్డూలను ఇచ్చారని ఆరోపించారు. శాస్త్రాలతో పాటు శస్త్రాలను కూడా వెంట తీసుకుని వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని రవికిషన్ పేర్కొన్నారు.

తిరుమల లడ్డూ కల్తీతో దేశవ్యాప్తంగా అలజడి రేగిందన్న ఎంపీ రవికిషన్.. దీనికోసం పోరాడేందుకు సాధువులు కూడా యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.


కార్తీ జోక్స్.. పవన్ ఫైర్

తిరుమల లడ్డూ వివాదంపై స్పందించాలని.. ఇటీవలే జరిగిన సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో హీరో కార్తీని అడగగా.. అది చాలా సున్నితమైన విషయమని, దాని గురించి తాను మాట్లాడను అని నవ్వుతూ చెప్పారు. దాంతో లడ్డూ కల్తీ విషయం హాస్యం చేయాల్సిన విషయం కాదంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఫైరయ్యారు. లడ్డూ వివాదంపై జోకులు వెసుకుని నవ్వుకుంటున్నారని, దీనిపై పోరాడాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.

 

 

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×