BigTV English

New Milkyway : విశ్వంలో మిల్కీవే తరహా గెలాక్సీ!

New Milkyway : విశ్వంలో మిల్కీవే తరహా గెలాక్సీ!
New Milkyway

New Milkyway : అనంత విశ్వంలో మరో నక్షత్ర మండలం బయటపడింది. ఆ గెలాక్సీ అచ్చం మన పాతపుంత(Milky Way)లాగానే ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వానికి 2 బిలియన్ సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇది ఏర్పడినట్టు భావిస్తున్నారు.


మిల్కీవే సహా సర్పిలాకార గెలాక్సీల్లోని రెండొంతుల వరకు.. ఆ గెలాక్సీల మధ్యన చిన్నచిన్న నక్షత్రాలన్నీ కలసి కమ్మీ(బార్) ఆకారంలో కనిపిస్తాయి. ఇలాంటి బార్ షేప్డ్ స్పైరల్ గెలాక్సీలన్నీ బిగ్ బ్యాంగ్ తర్వాత 4 బిలియన్ సంవత్సరాలకు ఏర్పడటం ఆరంభమై ఉండొచ్చనేది సూత్రీకరణ. తాజా పరిశోధన ఆ వాదనకు సవాల్ విసురుతోంది.

ఆస్ట్రానమర్లు ప్రస్తుతం కనుగొన్న గెలాక్సీ అంతకన్నా పూర్వమే ఏర్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం మీద ఆ గెలాక్సీ వయసు 11 బిలియన్ సంవత్సరాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన కాస్మిక్ ఎవల్యూషన్ ఎర్లీ రిలీజ్ సైన్స్(CEERS) సర్వే వివరాలను విశ్లేషిస్తుండగా కొత్త గెలాక్సీ గురించి వారు తెలుసుకోగలిగారు.


ఈ సర్వేలో భాగంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సుదూరాన ఉన్న గెలాక్సీల తాలూకు వేలాది చిత్రాలను పంపింది. కొత్త గెలాక్సీని గుర్తించిన వెంటనే దాని ఆకారాన్ని శాస్త్రవేత్తలు తొలుత నిర్థారించలేకపోయారు. హబుల్ టెలిస్కోప్ సమాచారంతో పోల్చి చూసిన అనంతరమే అది బార్‌డ్ స్పైరల్ గెలాక్సీ అని విశ్లేషించగలిగారు.

కొత్త నక్షత్రమండలానికి CEERS-2112గా పేరు పెట్టారు. మన పాలపుంత స్పైరల్ గెలాక్సీ అయినా.. మధ్యభాగంలో అలాంటి బార్(కమ్మీ)నే కలిగి ఉంది. కొత్త స్పైరల్ గెలాక్సీ CEERS-2112 కూడా పాలపుంతలాగానే 11.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండొచ్చని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. దీంతో బార్‌డ్ గెలాక్సీల ఆవిర్భావం, పెరుగుదలకు సంబంధించిన సిద్ధాంతాలను పునర్నిర్వచించాల్సిన అవసరం కనపడుతోంది.

హబుల్‌తో పోలిస్తే ఆరురెట్లు కాంతిని గ్రహించగలదని, ఫలితంగా అత్యంత దూరంలో ఉన్న గెలాక్సీల రూపురేఖలను మరింత వివరంగా సేకరించలదు. తాజా పరిశోధన నేపథ్యంలో.. మిల్కీవే, విశ్వారంభం తొలినాళ్ల గురించి లోతైన అధ్యయనం చేసే వీలు చిక్కింది. CEERS-2112 లాంటి అతి ప్రాచీన గెలాక్సీల గురించే కాకుండా.. కృష్ణ పదార్థం, విశ్వం రహస్యాల గుట్టు వీడే అవకాశం ఉంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×