BigTV English

Rachin Ravindra : రికార్డుల రారాజు రచిన్.. సచిన్ రికార్డ్ బ్రేక్!

Rachin Ravindra : రికార్డుల రారాజు రచిన్..  సచిన్ రికార్డ్ బ్రేక్!

Rachin Ravindra : న్యూజిలాండ్ ఆటగాడు, భారత మూలాలున్న రచిన్ రవీంద్ర.. సచిన్ టెండూల్కర్ రికార్డ్ ఒక దానిని బ్రేక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏమిటా రికార్డ్ అంటే వన్డే ప్రపంచకప్ లో 23 ఏళ్ల వయసులో 523 పరుగులు చేసిన బ్యాటర్ గా సచిన్ రికార్డ్‌‌‌ క్రియేట్ చేసాడు.


అదే 23 ఏళ్ల వయసులోనే ఉన్న రచిన్ రవీంద్ర ప్రస్తుతం జరుగుతున్న 2023 వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగులు చేసి 565 పరుగులతో సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసాడు. అంతేకాదు మెగా టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా నిలిచాడు.

ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో 2019లో తాను ఆడిన మొదటి ప్రపంచకప్ లో 532 పరుగులు చేశాడు. అలా ఇంగ్లండ్ వరల్డ్ కప్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు రచిన్‌కు కూడా ఇది మొదటి ప్రపంచకప్. ప్రస్తుతం 565 పరుగులతో ఉన్న రచిన్.. బెయిర్ స్టో రికార్డ్ కూడా అధిగమించాడు.


ప్రపంచకప్ ఆడుతున్న తొలిమ్యాచ్ లోనే సెంచరీ కొట్టి అదొక రికార్డ్ కూడా నమోదు చేశాడు. అది ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ 123 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ (9), ఆఫ్గాన్ (32), ఇండియా (75), ఆస్ట్రేలియా (116), పాకిస్తాన్ (108) ఇలా 565 పరుగులు చేసుకుంటూ వెళ్లి ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.

రచిన్ తర్వాత సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ (550), ఆ తర్వాత ఇండియన్ కింగ్ విరాట్ కొహ్లీ (543)‌ ఉన్నారు. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ ఆఫ్గనిస్తాన్‌తో, భారత వెన్నుముక కోహ్లీ నెదర్లాండ్స్‌తో ఆడనున్నారు. ఇందులో ఎన్ని రికార్డులు బద్దలవుతాయో తెలీదు. వీరికి ఇంకో లీగ్ మ్యాచ్ మిగిలింది. రచిన్ కి అయిపోయాయి. కాకపోతే వీరంతా కలిసి సెమీఫైనల్స్ ఆడతారు. అప్పుడు ఎవరు మొనగాడో తేలిపోతుంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×