Nothing Phone 3 Launch| ఎన్నో ఊహాగానాలు, లీక్‌లు, అంచనాల తర్వాత.. నథింగ్ ఫోన్ 3 గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలోనూ అధికారికంగా లాంచ్ అయింది. 2023 జూలైలో విడుదలైన నథింగ్ ఫోన్ 2 తరువాత ఆ సిరీస్ లో వచ్చిన కొత్త ఫోన్ ఇది. ఈ ఫోన్‌లో గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ స్థానంలో కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్‌ను పరిచయం చేశారు. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాక, నథింగ్ ఫోన్ 3కి ఐదేళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని నథింగ్ హామీ ఇచ్చింది. నథింగ్ ఫోన్ 3 గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 3 ధర, అందుబాటు
నథింగ్ ఫోన్ 3 రెండు వేరియంట్లలో వస్తుంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్, 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్. ఇది వైట్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. 12GB ర్యామ్ మోడల్ ధర రూ. 79,999 కాగా, 16GB ర్యామ్ మోడల్ ధర రూ. 89,999గా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌లు అందుబాటులో ఉన్నాయి. జూలై 15 నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, విజయ్ సేల్స్, క్రోమా.. ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. ప్రీ-బుక్ చేసిన వారికి రూ. 14,999 విలువైన నథింగ్ ఇయర్ ఉచితంగా లభిస్తుంది.
HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో EMI లావాదేవీలపై రూ. 5,000 తగ్గింపు ఉంది. అలాగే, ICICI బ్యాంక్, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కూడా రూ. 5,000 తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.
నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్స్
నథింగ్ ఫోన్ 3 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వరకు అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.5ని ఉపయోగిస్తుంది. ఈ ఫోన్‌కు 5 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి. ఇందులో 6.67-అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
కెమెరా విషయానికొస్తే, ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రధాన కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో 5,150mAh బ్యాటరీ ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అదనంగా, 5W రిజర్వ్ ఛార్జింగ్, 7.5W వైర్డ్ రిజర్వ్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి వినియోగదారులకు అదనపు సౌలభ్యాన్ని అందిస్తాయి.