Dil Raju – Shirish Reddy : సౌత్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. 2003లో నిర్మాతగా అడుగులు వేసిన దిల్ రాజు (Dilraju) ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఒక్కో సక్సెస్ చవిచూస్తూ.. నేడు స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. మరొకవైపు ఎఫ్ డీ సీ చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఫుల్ ఫ్రస్టేషన్ లో SVC ప్రొడ్యూసర్స్..
ఇదిలా ఉండగా ఈమధ్య ఏమైందో తెలియదు కానీ స్టార్ హీరోలు వీళ్లకు డేట్స్ ఇవ్వకపోవడం.. మరొకవైపు తీసిన సినిమాలు కూడా సక్సెస్ కాకపోవడంతో ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హీరోలను, నిర్మాణ సంస్థలను తప్పు పట్టడంతో ఇప్పుడు ఆ హీరోల అభిమానులు దిల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు దిల్ రాజు మాత్రమే కాదు ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డి (Shirish Reddy) కూడా ఫుల్ ఫ్రస్టేషన్లో ఉన్నారని చెప్పవచ్చు.
కోపాన్ని హీరోలపై చూపిస్తున్న అన్నదమ్ములు..
అందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ అవడంతో రామ్ చరణ్ (Ram Charan)పలకరించలేదని, అటు మైత్రి మూవీ మేకర్స్ కూడా తమను మోసం చేశారు అంటూ చేసిన శిరీష్ చేసిన కామెంట్లు మెగా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇటు దిల్ రాజు కూడా నితిన్ ను ముఖానే “నువ్వు స్టార్ కాలేకపోయావు” అంటూ చేసిన కామెంట్లు కూడా నితిన్ అభిమానులకు పూర్తిస్థాయిలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని చెప్పవచ్చు.
ఈ అన్నదమ్ములకు చుక్కలు చూపిస్తున్న అభిమానులు..
ఇలా ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు గతంలో వరుస విజయాలు, భారీ కలెక్షన్లు చవిచూసి ఇప్పుడు కలెక్షన్లు పడిపోవడం, హీరోలు డేట్లు ఇవ్వకపోవడంతో ఆ ఫ్రస్టేషన్ తట్టుకోలేక వారిపైనే కోపం చూపించారు. దీంతో అభిమానులు ఊరుకుంటారా.. ఇక ఈ అన్నదమ్ములు ఇద్దరిపై తమ మాటల తూటాలు వదులుతూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ హీరోలు లేకపోతే మీ బ్రతుకు ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిగివచ్చిన శిరీష్ రెడ్డి.. క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్..
దీంతో దిల్ రాజు, శిరీష్ రెడ్డి ఇద్దరూ దిగివచ్చారు. ఈ మేరకు ఒక నోటు వదులుతూ క్షమాపణలు కోరారు. అందులో భాగంగానే శిరీష్ రెడ్డి ఒక అపాలజీ నోట్ రిలీజ్ చేస్తూ.. “అందరికీ నమస్కారం.. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా ద్వారా అపార్థాలకు దారి తీసి.. దానివల్ల కొంతమంది మెగా అభిమానులు బాధపడినట్లు నాకు తెలిసింది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో సంవత్సరాల నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటల వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమించండి” అంటూ శిరీష్ రెడ్డి తెలిపారు.
క్షమాపణలు చెప్పినా నమ్మబుద్ధి కావడం లేదే..
అయితే శిరీష్ రెడ్డి విడుదల చేసిన ఈ అపాలజీ లెటర్ చూసి కొంతమంది నిజంగా శిరీష్ రెడ్డి ఇది షేర్ చేశారా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శిరీష్ రెడ్డి రాంచరణ్ పై కామెంట్లు చేసిన తర్వాత ఫాన్స్ హెచ్చరికగా ఒక నోటు విడుదలయ్యింది. ఆ తర్వాత శిరీష్ రెడ్డి కూడా ఒక నోటు విడుదల చేయగా.. రెండింటినీ కంపేర్ చేస్తే.. సేమ్ అక్షరాలు.. సేమ్ బ్యాక్ గ్రౌండ్.. సేమ్ సైజ్.. ఇవన్నీ చూస్తే నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగా శిరీష్ రెడ్డి క్షమాపణలు చెప్పారా? లేక ఎవరైనా దేనిని క్రియేట్ చేశారా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు అని చెప్పాలి.
నమ్మకం రాకపోవడానికి కారణం ఇదేనా?
ఇకపోతే ఒకవేళ నిజంగానే శిరీష్ రెడ్డి క్షమాపణలు చెప్పి ఉంటే ఎస్విసి ప్రొడక్షన్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ పోస్టు విడుదల చేయాలి కదా.. లేదా శిరీష్ రెడ్డి సోషల్ మీడియా ఖాతా ద్వారా అయినా విడుదల చేయాలి కదా.. అలా రెండూ జరగలేదు. కాబట్టి ఇది ఎవరో క్రియేట్ చేశారు అని కూడా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.