Nindu Noorella Saavasam Serial Today Episode: ఫస్ట్ నైట్ కోసం మిస్సమ్మను చిత్ర రెడీ చేస్తుంది. నా అంత కాదు కానీ పర్వాలేదు బాగానే ఉన్నావు అంటుంది. దీంతో మిస్సమ్మ.. చిత్ర ఇదంతా అవసరమా అని అడుగుతుంది. దీంతో చిత్ర మీరు కలవడం మీకు అవసరం లేదేమో..? కానీ మాకు అవసరం.. పెళ్లై ఇలా దూరంగా ఉండటం ఎంత కష్టమో తెలుసా నీకు అంటుంది. దీంతో మిస్సమ్మ ఏంటి రెండు రోజులకేనా అంటుంది. అవునమ్మా రెండు రోజులే రెండు యుగాలుగా అనిపిస్తుంది. మీది లవ్ మ్యారేజ్ కాదు కదా కానీ మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ కానీ మా మధ్య కూడా ప్రేమ ఉంది అని చెప్తుంది. అయితే అది నిజం అని ఇవాళ నిరూపించు అని చెప్తుంది.
మరోవైపు మనోహరి బెడ్రూంను పూలతో అలంకరిస్తుంది. ఇంట్లో జరుగుతున్నదంతా గుప్త తన మంత్రంతో ఆరుకు చూపిస్తాడు. అది చూసిన ఆరు ఏడుస్తూ కూర్చుటుంది. దీంతో గుప్త నవ్వుతూ.. బాలిక మాకొక విషయం అవగతం అవ్వడం లేదు. వారిరువురిని కలపడం కోసం నువ్వే ప్రయత్నిస్తువి కదా మరి ఎందుకు ఇప్పుడు నీకీ ఈ వ్యథ అని అడగ్గానే.. అప్పుడు ఎన్నో రోజులు ప్రిపేర్ అయితే కలపడానికి ట్రై చేశాను. ఇప్పటికి ఇప్పుడంటే ఏదోలా ఉంది అని చెప్తుంది. అది కాదు గుప్త గారు ఇప్పటికి ఇప్పుడు ఇది అంటే ఆయన ఎలా ఫీలవుతారు. పాపం ఆయన ఏమైపోతారు చెప్పండి అంటుంది. అది నన్ను అడిగితే నేనేం చెప్పగలను కాసేపట్లో నీ పతి దేవుడు వస్తాడు. అతగాడినే ఆ ప్రశ్న అడుగుము అని గుప్త చెప్తాడు.
ఇంతలో అమర్ బయటి నుంచి వస్తాడు. రాథోడ్ ఈ రోజు నైట్ నేను పడుకునే సరికి కొంచెం లేట్ అవుతుంది. పొద్దునే కూడా ఎర్లీగా ఏం రాకు పది గంటలకు వెళ్దాం.. నేను లేచాక నీకు కాల్ చేస్తాను అప్పుడు వచ్చేయ్ అని చెప్పి వెళ్లిపోతాడు. అంతా వింటున్న గుప్త నవ్వుతూ.. తమరి ప్రశ్నకు సరియైన సమాధానం దొరికినట్టు ఉన్నది అని చెప్పగానే.. ఆయన మీరు అనుకున్నట్టు కాదు గుప్త గారు. లేదు అది మీరు విన్నారు కదా..? నేను మళ్లీ మనిషినై జన్మెత్తి ఈ భూమి మీదకు వచ్చాక కూడా వదలరు చూడండి అందుకు బాధగా ఉంది అంటూ ఇంక ఆ లోపల జరిగేది కూడా గాలిలో గీతలు గీసి చూపిస్తారు కదా చూపించండి అంటుంది ఆరు. గుప్త సరే అంటూ మంత్రం వేస్తాడు. అమర్ తమ రూంలోకి వెళ్లగానే.. మనోహరి డెకరేట్ చేస్తుంది. మనోహరి మా రూంలో ఏం చేస్తున్నావు.. అసలు ఏంటి ఇదంతా అని అడుగుతాడు.
దీంతో మనోహరి కార్యానికి రూం డెకరేట్ చేయమంటే చేస్తున్నాను అమర్ అని చెప్తుంది. దీంతో అమర్ కోపంగా వినోద్, చిత్ర వాళ్ల రూం ఉంది కదా ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అసలు ఇదంతా చేయమని నీకెవరు చెప్పారు..? భాగీ ఎక్కడ..? అని అడగ్గానే రెడీ అవుతుంది అని మనోహరి చెప్తుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మనోహరి వాళ్ల కార్య ఇక్కడ పెట్టడం ఏంటి అని అడుగుతాడు. వాళ్ల కార్యం జరగాలంటే ముందు నీకు భాగీకి కార్యం జరగాలట కదా అని మనోహరి చెప్తుంది. దీంతో అమర్ అవును భాగీ చెప్పింది అయితే.. అని అడుగుతాడు. అందుకే ఇవాళ నీకు భాగీకి శోభనం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తుంది. ఏంటి మనోహరి ఇదంతా వాళ్లు చెప్తే నువ్వు చేసేస్తావా..? ఇది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్ మేమిద్దరం మాట్లాడుకుంటాం కదా..? అంటాడు.
అంతా గమనిస్తున్న ఆరు అది మా ఆయన అంటే బంగారు కొండ అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. నాకు ఇదంతా చేయడం సరదా కాదు. చిత్ర అడిగిందని బాధపడుతుందని నా బాధను పక్కనపెట్టి ఇదంతా చేస్తున్నాను. ఒకరకంగా చూసుఏకుంటే భాగీ ప్లేస్‌లో నేను ఉండాల్సిన దాన్ని కదా..? అని చెప్తుంది. అంతా గమనిస్తున్న ఆరు ఇదొక్కటి ఎక్కడికి వెల్లినా తిరిగి అక్కడికే వస్తుంది అని తిట్టుకుంటుంది. అదే మనం అనుకున్నట్టు మన పెళ్లి జరిగి ఉంటే నేను ఉండేదాన్ని కదా అంటున్నాను అమర్. అలాంటిది నేను ఇలాంటిది ఎలా చేస్తాను అనుకుంటున్నావు ఈ డ్రెస్ తీసుకో అమర్ రెడీ అవ్వు అంటూ మనోహరి వెళ్లిపోతుంది. చూశారా గుప్త గారు మా ఆయనకు అసలు ఇదంతా చేస్తున్నారని కూడా తెలియదు అని చెప్తుంది.
తర్వాత అమర్ రెడీ కాగానే చిత్ర, మనోహరి ఇద్దరూ కలిసి మిస్సమ్మను తీసుకొచ్చి అమర్ రూంలోకి తోసేస్తారు. మిస్సమ్మ సిగ్గుతో పాల గ్లాస్ పట్టుకుని అమర్ దగ్గరకు వెళ్తుంది. కింద చిత్ర హ్యాపీగా ఉండటం చూసిన వినోద్ ఇవాళ అక్కడ కార్యం అయిపోతుందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు మా అన్నయ్య ఏదీ అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు.. నీకు మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు అంటాడు. దీంతో చిత్ర అవును తెలియదు కానీ నేను మీ అన్నయ్యకు ఇచ్చే పాలల్లో నేను టాబ్లెట్ కలిపిన విషయం నీకు తెలియదు అని చెప్తుంది. దీంతో వినోద్ షాక్ అవుతాడు. మరోవైపు రూంలో పాలు తాగిన అమర్ రొమాంటిక్‌గా మిస్సమ్మను చూస్తూ.. ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా..? అంటూ హగ్ చేసుకుంటాడు. మిస్సమ్మ షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?