Gmail : నేటి రోజుల్లో జీమెయిల్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ డిజిటల్ వరల్డ్ లో ప్రతీ విషయం జీమెయిల్ తో కనెక్ట్ అయిపోయింది. ఆన్ లైన్ సేవలతో పాటు స్టడీ, జాబ్ కు సంబంధించిన ప్రతీ విషయం జీమెయిల్ లేకుండా జరగటం లేదు. ఇక ఈ విషయాన్నే ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జీమెయిల్ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇక ఫేక్ మెయిల్స్ ను ఓపెన్ చేయటంతో జీమెయిల్ హ్యాక్ అయ్యే అవకాశం సైతం ఉంది. అయితే అసలు జీమెయిల్ హ్యాక్ అయిందా..లేదా అనే విషయం ఎలా తెలుసుకోవాలంటే…!
జీమెయిల్ తో రోజురోజుకీ పెరుగుతున్న ఉపయోగాలతో పాటు మోసాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ సేవల్లో భాగంగా జీమెయిల్ ను ఉపయోగిస్తున్న వారిని ఆసరాగా చేసుకొని ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నిజానికి మెయిల్ కు ఏదైనా జరిగితే ఎంతో ఉపయోగకరమైన డేటా మొత్తం ఇందులో ఉండటంతో నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జీమెయిల్ కొన్నిసార్లు తెలియకుండానే హ్యాక్ అయిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ లోపల జరగాల్సిన నష్టం జరగబోతుంది. అందుకే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్స్ ను చెక్ చేస్తూ ఉండాలి.
నిజానికి గూగుల్ లో యూజర్ ఎప్పుడు, ఎక్కడ అకౌంట్ ను చివరిసారిగా యూజ్ చేశారని తెలుసుకునే ఫీచర్ ఒకటి ఉంటుంది. అదే లాస్ట్ అకౌంట్ యాక్టివిటీ ఆప్షన్. ఈ ఆప్షన్ కోసం చాలా మందికి తెలియదు. గూగుల్ లోకి వెళ్లి లాస్ట్ అకౌంట్ ఆక్టివిటీ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఇక్కడ ఒక లిస్ట్ అనిపిస్తుంది. ఈ లిస్టులో లొకేషన్స్ తో పాటు డివైజ్ ల పేర్లు సైతం కనిపిస్తాయి. ఇక ఇందులో ఏదైనా తెలియని అకౌంట్స్, డివైజెస్ కనిపిస్తే మీ అకౌంట్ ను ఎవరైనా హ్యాక్ చేసి ఉండవచ్చు అని తేలికగా అర్థం చేసుకోవాల్సిందే. డెస్క్ టాప్ వెర్షన్ లో జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ లాస్ట్ ఎకౌంట్ యాక్టివిటీ ఆప్షన్ ను చూడవచ్చు. ఇందులో డీటెయిల్స్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీని పైన క్లిక్ చేసినా ఎకౌంట్ ను ఎవరెవరు ఉపయోగించారనే విషయం తేలికగా కనిపెట్టే అవకాశం ఉంటుంది.
ఇక వీటితో పాటు జీమెయిల్ కు సెక్యూరిటీ ఈ మెయిల్, ఫోన్ నెంబర్ సైతం ఇవ్వాలి. దీని వలన వేరే డివైజస్ లో లాగిన్ అయినప్పుడు వెంటనే అలర్ట్ వస్తుంది. ఇలా అఫీషియల్ ఈమెయిల్ కు ఇచ్చే ఆల్టర్నేట్ జీమెయిల్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అకౌంట్ లాగిన్ కు సంబంధించిన ఏవైనా మెయిల్స్ వస్తే అప్రమత్తమవ్వాలి. యూజర్ చేయని మార్పులు ఏమైనా మెయిల్ లో కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. పాస్వర్డ్, ప్రొఫైల్లో మార్పులు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే పాస్వర్డ్స్ మార్చేయటం, తెలియని డివైజెస్ ను డిలీట్ చేయటం చేయాలి
ALSO READ : రూ.8,499 స్మార్ట్ వాచ్ కేవలం రూ.1400కే.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే!