BigTV English

Google Chrome : గూగుల్‌ క్రోమ్‌లో ఈ సూపర్​ ఫీచర్‌ గురించి తెలుసా? – ఎంచక్కా అన్నీ చదివి వినిపించేస్తుంది!

Google Chrome : గూగుల్‌ క్రోమ్‌లో ఈ సూపర్​ ఫీచర్‌ గురించి తెలుసా? – ఎంచక్కా అన్నీ చదివి వినిపించేస్తుంది!

Google Chrome : బ్రౌజర్‌ అంటే ఇంటర్నెట్ వినియోగదారులు చాలా మందికి టక్కున గుర్తొచ్చేది మొదటగా గూగుల్‌ క్రోమ్‌. యూజర్స్​కు మెరుగైన సెర్చ్‌ అనుభవాన్ని అందించేందుకు గూగుల్‌ ఎప్పటి కప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంటుంది. అందుకే చాలా మంది ఎలాంటి సమాచారం కోసమైనా దీనినే తెగ ఉపయోగిస్తుంటారు.


అయితే వార్తలు లేదా ఇతర సమాచారం తెలుసుకునేందుకు వివిధ బ్రౌజర్స్​లోని వెబ్‌సైట్‌లలోని కంటెంట్‌ చదవడం లేదా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో లేదా ప్రయాణ సమయంలో ఎక్కువ సేపు చదవాల్సి వచ్చినప్పుడు కంటెంట్‌ను ఎవరైనా చదివి వినిపిస్తే బాగుండు… లేదంటే ఇయర్ ఫోన్ పెట్టుకుని వింటే బాగుండు అని కూడా అనుకుంటాం. అలాంటి వారి కోసమే ఆండ్రాయిడ్‌లో గూగుల్‌ క్రోమ్​లో ఇలా చదివి వినిపించే ఫీచర్ ఒకటుందని మీకు తెలుసా? అవును నిజం, క్రోమ్‌ బ్రౌజరే చదివి వినిపిస్తుంది. ఒకవేళ దీని గురించి మీకు తెలియకపోతే, దీన్ని ఎలా ఉపయోగించాలో దీని వలన లాభాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

ఏదైనా వెబ్​సైట్​ లేదా పేజీలో పెద్ద సైజ్​ కంటెంట్​ను చదవాల్సి వచ్చిన సందర్భంలో… అది మనకి వినిపించేలా లిజన్‌ టు దిస్‌ పేజ్‌ అనే ఫీచర్​ను గూగుల్‌ కొన్నాళ్ల క్రితం  తీసుకొచ్చింది. ఇది క్రోమ్ వినియోగదారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మొదట ఇంగ్లిష్‌ భాషతో పాటు కొన్ని భాషలకు పరిమితమైందీ ఫీచర్‌. కానీ ఇప్పుడు తెలుగు తో పాటు మరికొన్ని బాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.


ALSO READ : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

కాబట్టి దీంతో మీకు నచ్చిన వార్త, సమాచారం లేదా ఇతర కంటెంట్​ను ఎంచక్కా హెడ్‌ ఫోన్స్‌, ఇయర్ ఫోన్స్​ పెట్టుకుని వినొచ్చు అన్నమాట. దీని కోసం క్రోమ్‌ బ్రౌజర్‌లోని త్రీడాట్స్‌ మెనూపై క్లిక్‌ చేయాలి. అనంతరం లిజన్‌ టు దిస్‌ పేజ్‌ అనే ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక దాని పై క్లిక్‌ చేస్తే చాలు.. ఆ పేజీలోని మొదటి నుంచి చివరి వరకు ఉన్న సమాచారాన్ని అంతా వాయిస్‌ అసిస్టెంట్‌ చదివి చక్కగా, అర్థమయ్యేలా వినిపిస్తుంది.

పైగా ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ ఏ పేరా చదువుతుందో కూడా ఎంచక్కా చూపిస్తుంది. ఇంకా ఇందులో వినియోగదారుల కోసం మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఆడియోను ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ లేదా బ్యాక్‌ వర్డ్‌ కూడా చేయొచ్చు. మీకు మేల్‌ లేదా ఫీమేల్‌.. ఏ వాయిస్‌ కావాలన్నా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అదే స్పీడ్​గా వినాలనుకునే వారి కోసం 1X, 1.5X, 2X.. ఇలా స్పీడ్‌ బటన్ ఆప్షన్స్​ కూడా ఉంటాయి. వాటిని అడ్జస్ట్‌ చేసుకోవడమే. ఇది వినేటప్పుడు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే పాజ్‌ కూడా చేసుకోవచ్చు. అనంతరం మళ్లీ ప్లే చేసి మీ వాయిస్ అసిస్టెంట్​ను కొనసాగించొచ్చు. ఇంకా ఇది వినే సమయంలో స్క్రీన్‌ ఆన్‌లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బ్యాక్​ గ్రౌండ్‌లోనూ దీన్ని ప్లే చేసుకుని వినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మకు ఈ ఫీచర్‌ గురించి తెలియకపోతే ట్రై చేసి ఆస్వాదించండి.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×