Google Gemini Human Chat| ఒక మనిషిలాగా మీ ఫోన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా? అయితే మీ కోరిక తీరినట్లే అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ జెమిని లైవ్ ఫీచర్‌తో అది సాధ్యం! ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ తన వార్షిక డెవలపర్ల సమావేశం గూగుల్ I/O 2025లో పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఉండడం వల్ల మీరు మీ ఫోన్‌తో సంభాషించవచ్చు, లేదా మీ చుట్టూ ఉన్న వస్తువుల గురించి తెలుసుకోవడానికి ఫోన్ కెమెరాను కూడా ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ప్రాజెక్ట్ ఆస్ట్రా అనే ప్రాజెక్ట్‌లో భాగం, దీనిని గూగుల్ గత సంవత్సరం నుంచి అభివృద్ధి చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో గూగుల్ అధికారికంగా చేసిన ఓ పోస్ట్ ప్రకారం.. జెమిని లైవ్ ఫీచర్ త్వరలో గూగుల్ క్యాలెండర్, కీప్ నోట్స్, టాస్క్స్, మరియు మ్యాప్స్ వంటి అనేక ఫీచర్స్.. గూగుల్ యాప్‌లలో అందుబాటులోకి రానున్నాయి.
మీ ఫోన్ కెమెరాను ఆన్ చేయడం ద్వారా, జెమిని మీకు క్యాలెండర్‌లో ఈవెంట్‌లను జోడించడం నుంచి, మీ గమ్యస్థానానికి మార్గం చూపడం వరకు అన్నింటిలో సహాయపడుతుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు, సాధారణ ఫోన్‌తోనే దీనిని ఉపయోగించవచ్చు.
ముందుగా, మీ స్మార్ట్‌ఫోన్‌లో జెమిని యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఈ యాప్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, దానిని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, యాప్‌కు అవసరమైన అనుమతులను ఇవ్వండి, ఆ తరువాత అది మీతో సంభాషించడానికి సిద్ధంగా ఉంటుంది.
జెమిని యాప్‌ను తెరిచి.. మైక్ ఐకాన్ పక్కన ఉన్న ఐకాన్‌ను నొక్కండి. ఇది జెమిని లైవ్‌ను యాక్టివేట్ చేస్తుంది. మీ ఫోన్‌ను సంభాషణకు సిద్ధం చేస్తుంది. మీరు కెమెరాను ఉపయోగించాలనుకుంటే, కెమెరా ఐకాన్‌ను నొక్కండి. మీరు తెలుసుకోవాలనుకునే వస్తువు వైపు ఫోన్ కెమెరాను చూపండి, ఆపై స్క్రీన్‌ను నొక్కండి. అప్పుడు మీరు మీ ఫోన్‌తో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది! జెమిని ఆ వస్తువు గురించి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీ ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి.
Also Read: చాట్‌జిపిటి సాయంతో నష్టపోయిన రూ.2లక్షలు తిరిగిపొందిన ప్రయాణికుడు.. ఎలాగంటే?
ఈ ఫీచర్ మీ రోజువారీ పనులను సులభతరం చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక దుకాణంలో ఉన్నప్పుడు ఏదైనా ఉత్పత్తి గురించి తెలుసుకోవాలనుకుంటే, కెమెరాను దాని వైపు చూపితే, జెమిని దాని గురించి వివరాలు చెబుతుంది. అలాగే, మీరు ఒక కొత్త ప్రదేశంలో ఉంటే, మ్యాప్స్‌తో కలిపి జెమిని మీకు మార్గాన్ని చూపించే పని చేస్తుంది. ఈ సాంకేతికత మీ ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా, మరింత ఉపయోగకరంగా మారుస్తుంది.
జెమిని లైవ్ ఫీచర్ అనేది టెక్నాలజీ పరిజ్ఞానంలో ఒక ముందడుగు. ఇది మన రోజువారీ జీవితంలో ఫోన్‌ను ఒక స్నేహితుడిలా మారుస్తుంది. మీరు కూడా ఈ ఫీచర్‌ను ప్రయత్నించి, మీ ఫోన్ ని ఒక ఫ్రెండ్ లాగా సంభాషింస్తూ ఆనందించండి!