Hyderabad Metro Phase 2B: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరిస్తోంది. తాజాగా JBS-మేడ్చల్, JBS-షామీర్ పేట్, ఎయిర్ పోర్టు- ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్లకు సంబంధించిన హైదరాబాద్ మెట్రో ప్రతిపాదిత ఫేజ్ 2Bకి సంబంధించి DPRలు రెడీ అయ్యాయి. మొత్తం 86.1 కిలో మీటర్ల పరిధిలో సుమారు రూ. 19,579 కోట్ల వ్యయంతో ఈ మెట్రో ఫేజ్ ను నిర్మించనున్నారు.
JBS- మేడ్చల్ 24.5 కి.మీ, JBS – షామీర్ పేట్ 22 కి.మీ..
JBS స్టేషన్ – మేడ్చల్ మార్గం 18 స్టేషన్లతో 24.5 కిలోమీటర్ల పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్‌గా ఉంటుంది. JBS స్టేషన్ – షామీర్‌పేట్ మార్గం 14 స్టేషన్లతో 22 కిలోమీటర్ల కారిడార్‌గా ఉంటుంది. ఈ మార్గం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో 20.35 కి.మీ ఎలివేటెడ్ సెక్షన్ మరియు 1.65 కి.మీ భూగర్భ భూగర్భ సెక్షన్‌గా ఉంటుంది. సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుండి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్‌గా కరీంనగర్ హైవేపై హెచ్‌ఎండీఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్‌పై నేరుగా పొడిగిస్తారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి వచ్చే వారితోపాటు, హైదరాబాద్ నగరంలోని ఉత్తర ప్రాంతాల ప్రజల రాకపోకలు , ఇతర అవసరాలను తీర్చడానికి జేబీఎస్ ను ఒక ప్రపంచ స్థాయి మెట్రో హబ్ గా అభివృద్ధి చేయబోతున్నారు.
1.5 కిలో మీటర్ల మేర భూగర్భంలో పరుగులు
ఇక RGIA- ఫ్యూచర్ సిటీ మార్గం 39.6 కిలోమీటర్లుగా విస్తరించనున్నారు. ఇందులో 1.5 కి.మీ భూగర్భ విభాగం ఉంటుంది. 21 కి.మీ ఎలివేటెడ్, 17 కి.మీ గ్రేడ్ లేదంటే గ్రౌండ్ లో ఉంటుంది. ఈ మార్గం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పెద్ద గోల్కొండ, రావిర్యాల ORR ఎగ్జిట్స్ ద్వారా స్కిల్స్ యూనివర్సిటీ వరకు ఉంటుంది.
Read Also: త్వరలో న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ స్లీపర్ పరుగులు… టికెట్ ధర ఎంతో తెలుసా?
కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా..
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు నిర్మాణ అంచనాలు, హైదరాబాద్ రాజధాని ప్రాంతం ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కారిడార్లకు సంబంధించిన DPRలను తయారు చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ DPRలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం DPRలను ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు JBS ప్రాంతాన్ని అంతర్జాతీయ కేంద్రంగా మార్చడం లాంటి అనేక అంశాలు ఈ నివేదికలలో ఉన్నాయని రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2Bలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మేడ్చల్, శామీర్ పేట్ దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో సాంకేతికంగానూ ముందడుగువేయబోతోంది.
Read Also: త్వరలో న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ స్లీపర్ పరుగులు… టికెట్ ధర ఎంతో తెలుసా?
Read Also:ఏం వాడకమయ్యా.. డ్రోన్లతో రైలు బోగీల క్లీనింగ్, ఎక్కడో కాదు ఇక్కడే!