Gemini AI – Spotify : మ్యూజిక్ అభిమానులకు స్పాటిఫై గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ యాప్ లోని మిలియన్ల కొద్ది పాటలు.. మ్యూజిక్ లవర్స్ హియర్ ఫోన్స్ లో మోగుతూనే ఉంటాయి. ఏదైనా ఆల్బమ్ పేరుతోనో, సింగర్ పేరుతోనో పాటల్ని వేళ్లపై స్కోల్ చేస్తూ సెలెక్ట్ చేసుకుని ఆస్వాదించవచ్చు. ఇలాంటి స్పాటిఫై.. కొన్నిరోజుల్లోనే సరికొత్త ఫీచర్ తో ఆకట్టుకోనుంది. ఇకపై.. మ్యానువల్ ఆపరేటింగ్ అవసరం లేకుండా.. జస్ట్ కమాండ్ చేస్తూ పాటల్ని ఎంచుకోవచ్చు. సరదాగా వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగంటారా.?.. ఇదిగో ఇలా..
గూగుల్ ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ స్పాటిఫై కోసం థర్డ్-పార్టీ జెమిని ఎక్స్‌టెన్షన్ సపోర్ట్‌ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. జూన్ లో విడుదల చేసిన గూగుల్ కోడ్ లో తొలిసారి ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎక్స్‌టెన్షన్ ఆండ్రాయిడ్ డివైజులను ఎంచుకునేందుకు వీలవుతుందని తెలుపుతుంది. ఈ ఆప్షన్ ద్వారా యూజర్లు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అసిస్టెంట్‌ని ఉపయోగించి మ్యూజిక్ సెర్చ్ చేసేందుకు, ప్లే చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ సెర్చింగ్ యాప్ తర్వలోనే మరో ఐదు ఎక్స్‌టెన్షన్ లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఎక్స్‌టెన్షన్ లు వివిధ యాప్ లను గూగుల్ వాయిస్ కమాండ్ ద్వారా సులువుగా ఆపరేట్, యూజ్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. అయితే.. కొంతమంది యూజర్లు.. గూగుల్ అసిస్టెంట్, జెమిని వంటి వాటి ద్వారా వాట్సాప్, ఫోన్, మెసేజింగ్ వంటివి ఆపరేటింగ్ చేసే అవకాశం కోసం చూస్తున్నారు.
ఇక.. జెమిని ఎక్స్‌టెన్షన్ విషయానికి వస్తే.. ఈ అత్యాధునిక ఏఐ మోడల్ ద్వారా సాంగ్ పేరు, ఆర్టిస్ట్ పేర్లు లేదా ఆల్బమ్ పేర్లుతో స్పాటిపై లో సెర్చు చేసుకోవచ్చు. మీరు ఇష్టంగా రూపొందించుకున్న ప్లే లిస్ట్ లోని పాటల్ని… హాయిగా కుర్చిలో కూర్చునే జెమిని ద్వారా ప్లే చేసుకోవచ్చు. అయితే.. అందుబాటులోకి వస్తున్న ఈ ఫీచర్ ఉపయోగించి స్పాటిపైలో ప్లే లిస్ట్, రేడియో స్టేషన్ లను క్రియేట్ చేసేందుకు వీలుకాదు.
ఇక్కడే మరో టెక్నికల్ విషయాన్ని గూగుల్ జెమిని గుర్తు చేస్తుంది. ఇప్పటికే కొంత మంది యూట్యూబ్ మ్యూజిక్ ను జెమినికి కనెక్ట్ చేసి పాటల్ని వింటున్నారు. కాగా.. మీకు ఇప్పుడు స్పాటిఫై ద్వారా ఈ సౌకర్యాన్ని పొందాలి అనుకుంటే యూట్యూబ్ మ్యూజిక్ ఫర్మిషన్లు రద్దవుతాయి. ఈ రెండింటిలో ఏదైనా ఒకదానినే జెమిని ద్వారా కమాండ్ చేసేందుకు వీలవనుంది. జెమిని ద్వారా ఏ సర్వీ స్ ని ఉపయోగించాలి అనుకుంటున్నారో ముందే డిఫాల్ట్‌గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అంతే కాదు.. జెమిని ఎక్స్‌టెన్షన్ ఉపయోగించడానికి.. యూజర్లు స్పాటిఫై అకౌంట్ ని, గూగుల్ అకౌంట్ ని తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే మనం అడిగే, లేదా కమాండ్ చేసే ప్రశ్నలు 72 గంటల పాటు స్టోర్ అయ్యేలా అనుమతించాల్సి ఉంటుందని జెమిని వెల్లడించింది.
Also Read : దొంగలకే చెమటలు పట్టించే పోర్టల్.. ఇకపై ఫోన్ పోయిన 24 గంటల్లోనే..!
ఈ ఎక్స్‌టెన్షన్ ను స్టార్ట్ చేస్తే.. వాయిస్ కమాండ్ తోనే స్పాటిఫై ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అలానే.. ‘ప్లే మ్యూజిక్’, ‘ప్లే ఆన్ స్పాటిఫై’, ప్లే సాంగ్ నేమ్, ఆర్టిస్ట్ నేమ్.. ఇలా.. అనేక రకాలుగా స్పాటిపై లో మ్యూజిక్ ని ప్లే చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం… ఇప్పుడే గూగుల్ జెమిని ఎక్స్‌టెన్షన్ ని స్పాటిపై తో అనుసంధానించండి… ఇష్టమైన పాటల్ని వినండి.