BigTV English
Advertisement

గుడ్ న్యూస్.. హైదరాబాద్ to విజయవాడ జస్ట్ 4 గంటల్లోనే, ఈ రైలు వేగం ఎంతో తెలుసా?

గుడ్ న్యూస్.. హైదరాబాద్ to విజయవాడ జస్ట్ 4 గంటల్లోనే, ఈ రైలు వేగం ఎంతో తెలుసా?

India’s first Bullet Train: భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వందేభారత్ ఎక్స్ ప్రెస్ పేరుతో ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. వందేభారత్ మెట్రో, వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కబోతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. గంటకు ఏకంగా 280 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు రెడీ అవుతున్నట్లు పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.


చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో బుల్లెట్ రైలు తయారీ

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ..  BEML సహకారంతో బుల్లెట్ రైలును రెడీ చేస్తున్నది. దీనిని గంటకు 280 కి. మీ వేగంతో ప్రయాణించేలా హై-స్పీడ్ రైలు సెట్లను రూపొందిస్తున్నట్లు  రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించిన వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో,  ఇప్పుడు హై-స్పీడ్ రైళ్ల తయారీ మీద ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.


అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న బుల్లెట్ రైలు

ఇక హై-స్పీడ్ రైళ్ల తయారీ అత్యంత సంక్లిష్టతతో కూడుకున్న వ్యవహారం అన్నారు రైల్వే మంత్రి వైష్ణవ్. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏరోడైనమిక్, ఎయిర్‌ టైట్ కార్ బాడీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైలు సెట్ల బరువు ఆప్టిమైజేషన్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సరికొత్తగా ఉండబోతుందన్నారు.  “రైలు సెట్లలో ఏరోడైనమిక్ ఎక్స్‌ టీరియర్స్, సీల్డ్ గ్యాంగ్‌ వేలు, ఆటోమేటిక్ డోర్లు, కంపార్ట్‌ మెంట్లలో ప్రయాణీకుల సౌకర్యం కోసం అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, సిసిటీవీలు, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాలు, చక్కటి లైటింగ్, ఫైర్ సేఫ్టీ ఎక్యుప్ మెంట్స్ లాంటి బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో కూడిన చైర్ కార్లు ఉంటయి” అని వెల్లడించారు. పూర్తి స్థాయి డిజైన్ ఖరారు చేసిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.

జపాన్ టెక్నాలజీ సాయంతో బుల్లెట్ రైలు తయారీ

గంటకు 280 కి.మీ ప్రయాణించే బుల్లెట్ రైలు జపాన్ టెక్నాలజీతో రూపొందుతున్నట్లు కేంద్రమంద్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైలును ముంబై-అహ్మదాబాద్ నడుమ నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ హై స్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్ట్‌ కు సంబంధించి ఇప్పటివరకు 336 కి.మీ పీర్ ఫౌండేషన్, 331 కి.మీ పీర్ నిర్మాణం, 260 కి.మీ గిర్డర్ కాస్టింగ్, 225 కి.మీ గర్డర్ లాంచింగ్ పనులు పూర్తయినట్లు వెల్లడించారు. అటు సముద్రగర్భంలో టన్నెల్ (సుమారు 21 కి.మీ) పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు.  508 కిలోమీటర్ల పొడవైన MAHSR ప్రాజెక్ట్‌ లో ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతిలో 12 స్టేషన్లను నిర్మించాలని భావిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు జస్ట్ నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చు.

Read Also: కాశ్మీర్ ‘వందే భారత్’ రైల్‌లో ఏసీతోపాటు ఇవి కూడా ఉంటాయట – లేకపోతే గజగజలాడాల్సిందే!

Related News

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Amazon Pay Offers: రూ.3వేలలోపే గోవా ట్రిప్, బుకింగ్‌లు స్టార్ట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు..

Vande Bharat: ఇక ఆ వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగింపు, ప్రయాణికులకు పండగే!

Mumbai Train: మరో రైలు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

IRCTC – New Year 2026: IRCTC క్రేజీ న్యూ ఇయర్ టూర్ ప్యాకేజీ, ఏకంగా 6 రోజులు ఫారిన్ ట్రిప్!

Big Stories

×