Dhanush: ప్రస్తుత కాలంలో సినిమా పరిశ్రమలో ఎంతో ఇష్టపడి చేసుకున్న పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదు. అయితే కొన్ని ప్రేమ పెళ్లిళ్లు ఉన్నాయి. ఇంకొన్ని పెద్దలు కుదిర్చిన సంబంధాలు ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని జంటలు ఏకాభిప్రాయంతో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కొందరు చడి చప్పుడు లేకుండా అఫీషియల్ గా ఇద్దరు అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నామని అనౌన్స్ చేస్తారు. కానీ కొందరు మాత్రం విడాకులు తీసుకోబోతున్నట్లు సాంకేతాలు ఇస్తూ ఉంటారు.
ఇకపోతే కొంతకాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంతా, నాగ చైతన్య ఎంతో ఇష్టంగా ప్రేమించుకుని ఇరువైపు పెద్దలను ఒప్పించి రెండు పద్ధతులలో పెళ్లి చేసుకుంది ఈ ప్రేమ జంట. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు ముందు వచ్చినప్పుడు చాలామంది నమ్మలేదు. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ డిలీట్ చేయటం. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవటం వలన కొన్ని కథనాలు వినిపించాయి. కొన్ని రోజుల తర్వాత ఈ కథనాలు అన్నీ కూడా నిజమే అని వాళ్లు కూడా అధికారికంగా విడాకులు ప్రకటించారు. ఇకపోతే ఇప్పుడు నాగచైతన్య శోభితతో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. వీరి పెళ్లి త్వరలో కావాల్సి ఉంది.
రీసెంట్ టైమ్స్ లో మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పెద్దలకు సంబంధం చేసుకుంది. అయితే ఈ పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వీరిద్దరూ కూడా ఏకాభిప్రాయంతో విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ గా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్, సైంధవి జీవి ప్రకాష్ కుమార్ కూడా విడాకులు తీసుకున్నారు. ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల వ్యవహారం కొన్ని రోజులు పాటు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి కోర్టు వీరిద్దరికీ విడాకులను మంజూరు చేసింది. ఇటీవల వీరు విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.గత వారం జరిగిన కోర్టు విచారణలో తాము కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని ఇద్దరూ చెప్పారు. దీంతో ఏకాభిప్రాయం ఆధారంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. రజినీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య ను 2004లో పెళ్లి చేసుకోగా, రెండేళ్ల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడు ధనుష్ అభిమానులను బాధిస్తుంది అని చెప్పాలి. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలుగా కూడా మంచి పేరు సంపాదించుకుంది ఐశ్వర్య రజినీకాంత్. ఇక ప్రస్తుతం ధనుష్ విషయానికి వస్తే వరుస సినిమాలతో తన కెరియర్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ధనుష్ దర్శకత్వం వహించిన రాయన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమాలో నటిస్తున్నాడు ధనుష్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Pushpa 2 Review Censor : పుష్ప 2 ఫస్ట్ సెన్సార్ రివ్యూ, జాతర ఎపిసోడ్ తోనే పైసా వసూల్