Google Scam Detection| సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో, గూగుల్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ‘స్కామ్ డిటెక్షన్ ఫీచర్’. ఈ ఫీచర్ సైబర్ స్కామ్‌ల గురించి ఆండ్రాయిడ్ యూజర్లకు తక్షణం అలర్ట్‌లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ పరికరాలలో సైబర్ నేరగాళ్లు రహస్యంగా స్కామ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లయితే, వాటిని వెంటనే గుర్తించడానికి ఈ ఫీచర్ AI టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ ఫీచర్‌తో పాటు, గూగుల్ మరో 3 కొత్త ఫీచర్‌లను కూడా ప్రవేశపెట్టింది. వాటి గురించి తెలుసుకుందాం.
స్కామ్ డిటెక్షన్ ఫీచర్
‘స్కామ్ డిటెక్షన్ ఫీచర్’ మన ఆండ్రాయిడ్ పరికరంలోని ‘గూగుల్ మెసేజెస్’లోకి వచ్చే అన్ని సందేశాల్లో అపరిచితుల నెంబర్స్ (అన్‌నోన్ కాంటాక్ట్స్) నుంచి వచ్చే మెసెజెస్ మాత్రమే నిరంతరం స్కాన్ చేస్తుంది. ఏదైనా సందేశం స్కామ్ స్వభావాన్ని కలిగి ఉంటే, వెంటనే AI టెక్నాలజీ ద్వారా గుర్తించి యూజర్‌కు అలర్ట్ నోటిఫికేషన్ పంపుతుంది. ఈ నోటిఫికేషన్‌ను చూసిన తర్వాత, యూజర్ ఆ అనుమానాస్పద సందేశాన్ని పంపిన వ్యక్తిని బ్లాక్ చేయవచ్చు లేదా రిపోర్ట్ చేయవచ్చు. ఈ ఫీచర్ వల్ల డబ్బులు, సున్నితమైన సమాచారాన్ని కోల్పోకుండా రక్షణ లభిస్తుంది. అయితే పర్సనల్ మెసేజెస్ (సేవెడ్ నెంబర్స్) ని మాత్రం స్కాన్ చేయదు. ఒకవేళ యూజర్ ఈ ఫీచర్ వద్దనుకుంటే గూగుల్ మెసెజెస్ స్పామ్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి దాన్ని డిజేబుల్ చేయొచ్చు. ఈ స్కామ్ డిటెక్సణ్ ప్రస్తుతానికి ఇంగ్లీషు భాషలోనే లాంచ్ చేశారు. అమెరికా, యుకె, కెనడా లాంటి మూడు దేశాల్లో మాత్రమే అందుబాటులోకి ఉంది. త్వరలో అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది.
Also Read: వంట పాత్రలు శుభ్రం చేసేందుకు కష్టపడుతున్నారా?.. ఇదిగో ఈ మెషీన్లు ఉన్నాయిగా!
ఆండ్రాయిడ్ ఆటోలో కొత్త గేమింగ్ యాప్‌లు
ఆండ్రాయిడ్ ఆటో విభాగంలో గూగుల్ కొత్త గేమింగ్ యాప్‌లను కూడా జోడించింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన గేమ్‌లలో క్యాండీ క్రష్ సోడా సగా, యాంగ్రీ బర్డ్స్ 2, బీచ్ బగ్గీ రేసింగ్ వంటివి ఉన్నాయి. ఈ గేమ్‌లు ఆండ్రాయిడ్ ఆటో యూజర్లకు మరింత వినోదాన్ని అందిస్తాయి.
లైవ్ లొకేషన్ షేరింగ్
ఆండ్రాయిడ్ పరికరాలలో ‘ఫైండ్ మై డివైజ్’ అనే విభాగం ఉంటుంది. ఇది పోగొట్టుకున్న పరికరాలను వెతకడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు గూగుల్ ‘లైవ్ లొకేషన్ షేరింగ్’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా, పోగొట్టుకున్న పరికరం యొక్క ప్రస్తుత స్థానాన్ని యూజర్ షేర్ చేయవచ్చు. ఇది పోగొట్టుకున్న పరికరాన్ని కనుగొనడంలో మరింత సహాయకరంగా ఉంటుంది. పోగొట్టుకున్న పరికరాన్ని కనుగొన్న వ్యక్తికి మరియు పోగొట్టుకున్న వ్యక్తికి మధ్య సరైన సంప్రదింపు కుదరడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
గూగుల్ పిక్సెల్ ఎక్స్‌క్లూజివ్
పిక్సెల్ స్మార్ట్ ఫొన్లు, ఇతర పిక్సెల్ డివైజ్లలో గూగుల్ కంపెనీ ఒక కొత్త ఎక్స్‌క్లూజివ్ (వేరే ఎక్కడా లేని) ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు పిక్సెల్ 9 ఫోన్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కంపెనీ కొత్తగా ఈ ఫోన్లలో కనెక్టివిటీ, క్రియేటివ్ టూల్స్ అందిస్తోంది. ఈ టూల్స్ లో ముఖ్యంగా గోప్రో కెమెరాలు, పిక్సెల్ ఫోన్స్‌ని వయా బ్లూ టూత్, వైఫై స్ట్రీమ్ తో కనెక్ట్ చేయొచ్చు. మల్టిపుల్ యాంగిల్స్ ఫీచర్స్ ఉన్న కెమెరాల ద్వారా తీసే వీడియోలు, ఫొటోలను యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సపోర్ట్ చేస్తున్నాయి.
క్రోమ్‌లో కొత్త షాపింగ్ ఫీచర్‌లు
గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ పరికరాలు మరియు క్రోమ్‌లో కొత్త షాపింగ్ టూల్స్ మరియు ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్‌లను ఉపయోగించి, వివిధ ఉత్పత్తుల ధరలలో హెచ్చుతగ్గులు మరియు ధరల పోలిక వంటి సమాచారాన్ని నేరుగా చెక్ చేయవచ్చు. ఇది యూజర్లకు షాపింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.