Adhira Movie Update: ఓ వైపు ఓజీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో ఓజీ నిర్మాత దాసరి కళ్యాణ్(డీవీవీ దానయ్య కొడుకు) హీరోగా నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. టించారు. ఆయన హీరోగా పరిచయం అవుతూ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ యూనివర్స్‌లో చేస్తున్న చిత్రం ‘అధిర‘. దాసరి కళ్యాణ్ హీరోగా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రకటన వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు దర్శకుడు మారడం అందరిని సర్ప్రైజ్ చేస్తుంది.
అయితే ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఒకే అయ్యింది. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్లో ఎలాంటి కదలికలు లేవు. ఒకానోక టైంలో అదిర ఆగిపోయిందనే టాక్ కూడా వచ్చింది. కానీ, డీవీవీ చొరవతో ఈ సినిమాకు సెట్స్పైకి వస్తుంది. ఈ మేరకు మూవీ టీం ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు అదిరకు సంబంధించిన కొస్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎస్ జే సూర్య యముడిగా కనిపించారు. డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరోగా కళ్యాణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.
ఆర్కేడీ స్టూడియో బ్యానర్లో ఆర్ దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసిగా రాబోతోన్న ఈ చిత్రంలో కళ్యాణ్ దాసరి సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. చనిపోయిన వారిని కూడా బతికించే ఫిక్సన్ స్టోరీ ఇది అని తెలుస్తోంది. డీవీవీ దానయ్య కుమారుడిగా ఇప్పటికే నిర్మాతగా మారాడు కళ్యాణ్. ఇప్పుడు హీరోగాను ప్రూవ్ చేసుకునేందుకు సిద్దమయ్యాడు. నిజానికి ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాల్సి ఉంటుంది. ఆయన డైరెక్షన్‌లోనే ఈ సినిమా ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచే ఈ సినిమా వస్తున్నప్పటికి డైరెక్టర్ మాత్రం ప్రశాంత్ వర్మ కాదు.
ఆయన దర్శకుడిగా కళ్యాణ్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను డీవీవీ ప్రశాంత్ వర్మకు అప్పగించారు. ఈ మేరకు రూ. 2 కోట్లు కూడా అడ్వన్స్ తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. మూవీని ప్రకటించారు. కానీ, ఏమైందో తెలియదు కానీ, సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తేజ సజ్జాతో జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలు చేశాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక హనుమాన్ అయితే పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో.. ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. దీంతో వరుస ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ.. అధిరకు దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నాడట.
When darkness blooms the world, a LIGHTNING of hope emerges ❤️🔥
Presenting @IamKalyanDasari and @iam_SJSuryah in #ADHIRA ⚡️
A New SUPERHERO from #PrasanthVarmaCinematicUniverse 💥💥💥
Created By @PrasanthVarma
A @RKDStudios Production
Presented By RK Duggal
Directed By… pic.twitter.com/pZLyZX6aQv— Prasanth Varma Cinematic Universe (@ThePVCU) September 22, 2025