Budget iPhone: దసరా పండుగ సందర్భంగా చాలా మంది కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని ఉత్సాహంగా ఎదురుచూస్తారు. ఈ సందర్భంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పుడు బడ్జెట్‌లోనూ అద్భుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కువ ధరల్లో మాత్రమే దొరికే ఫీచర్లు, ఇప్పుడు 10,000 రూపాయల లోపలే లభిస్తున్నాయి. ఈ ధర రేంజ్‌లో కూడా 5జి కనెక్టివిటీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలు, నమ్మదగిన కెమెరాలు ఆల్ ఇన్ వన్ గా లభిస్తున్నాయి.
సాధారణంగా ఫోన్ కొనుగోలు చేసే ముందు వినియోగదారులు దృష్టి పెట్టే విషయాలు ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ. ప్రస్తుతం బడ్జెట్ ఫోన్లలోనూ మిడ్-రేంజ్ ప్రాసెసర్లు వాడుతున్నందున గేమింగ్, నెట్‌వర్క్ వేగం, డైలీ టాస్క్‌లలో మంచి పనితీరు లభిస్తోంది. 90హెచ్‌జెడ్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేలు అందుబాటులో ఉండటం వల్ల స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ అనుభవం సాఫీగా ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, గతంలో బడ్జెట్ ఫోన్ల కెమెరాలు సరాసరి క్వాలిటీ ఇస్తే, ఇప్పుడు 50ఎంపి, 64ఎంపి ప్రధాన కెమెరాలు, నైట్ మోడ్, మల్టిపుల్ లెన్స్ ఆప్షన్లు అందుతున్నాయి. బ్యాటరీ విషయానికొస్తే 5000ఎంఏహెచ్ పైగా సామర్థ్యం కలిగిన ఫోన్లు ఒక రోజు కంటే ఎక్కువ సేపు సపోర్ట్ చేయగలవు.
Also Read: Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?
2025లో 10,000 రూపాయల లోపలే అనేక మంచి ఫోన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సుమారు 5 ఫోన్ల గురించి వివరణ మీకోసం
Realme Narzo 60i Prime
90హెచ్‌జెడ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, హీలియో జి85 ప్రాసెసర్‌తో డైలీ యూజ్, గేమింగ్ అవసరాలకు బాగా సరిపోతుంది.
Redmi 12C 5G
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ ప్రాసెసర్‌తో పాటు 5జి కనెక్టివిటీ, 90హెచ్‌జెడ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది. ఫ్యూచర్-ప్రూఫ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
Poco C55
6.71 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఎంఏహెచ్ ప్రాసెసర్, 50ఎంపి కెమెరాతో సోషల్ మీడియా, వీడియోలు, సాధారణ గేమింగ్‌కి మంచి అనుభవాన్ని ఇస్తుంది.
Infinix Hot 25 Play
6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే జి5 చిప్‌సెట్, 50ఎంపి కెమెరాతో ఎక్కువసేపు ఫోన్ వాడే వారికి అనువైన ఎంపిక.
Itel Vision 3
అయితే సరళమైన డిజైన్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, హెడ్‌డి ప్లస్ డిస్ప్లేతో మొదటి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి సరైన ఎంపికగా నిలుస్తుంది.
దసరా పండుగ సందర్భంగా ఈ ఫోన్లలో ఏదైనా ఒకటి కొనుగోలు చేస్తే మీ బడ్జెట్‌ను మించకుండా ఆధునిక ఫీచర్లను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం 10,000 రూపాయల లోపల ఫోన్లు కేవలం ప్రాథమిక అవసరాలను మాత్రమే కాదు, హై-ఎండ్ ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. 5జి కనెక్టివిటీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్లు, నమ్మదగిన కెమెరాలు, పెద్ద బ్యాటరీ అన్నీ ఆల్ ఇన్ వన్. విద్యార్థులు, మొదటి స్మార్ట్ ఫోన్ యూజర్లు లేదా సెకండరీ ఫోన్ కోసం చూస్తున్నవారికి ఈ ఫోన్లు ఖచ్చితంగా డబ్బు పెట్టిన విలువ అనుభవం ఇస్తాయి. దసరా పండుగలో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే అది సాంకేతికంగా కూడా ఒక మంచి పెట్టుబడిగా మారుతుంది.