BigTV English
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Nindu Noorella Saavasam Serial Today Episode: రాత్రి పార్టీకి వెళ్లిన అమర్‌, మిస్సమ్మ ఇంకా ఇంటికి రాలేదని.. నాగు ఫోన్‌ కలవడం లేదని మనోహరి కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతుంది. గుమ్మం దగ్గర నిలబడిన ఆరు ఇదేంటి ఇంత కంగారు పడుతుంది. అని గుప్తను అడుగుతుంది. అది సృష్టి రహస్యం ఎవ్వరికీ చెప్పకూడదు అంటాడు. ఇంతలో అంజు కిందకు వచ్చి మనోహరికి థాంక్స్‌ చెప్తుంది. మా అమ్మ నాకు బర్తు ఇస్తే మీరు నా రీబర్తు ఇచ్చారు ఆంటీ నాకు మీరు మరో అమ్మ లాంటి వారు అని చెప్పగానే.. ఆరు ఏడుస్తూ.. అమ్మ లాంటిది కాదు నాన్న  తను నీకు అమ్మే అని మనసులో అనుకుంటుంది. ఇక అంజు మీరు చేసిన సాయానికి థాంక్స్‌ చెప్తే సరిపోదు ఆంటీ మిమ్మల్ని ఒకసారి హగ్‌ చేసుకోవచ్చా..? అని అడుగుతుంది.


దీంతో మనోహరి అదేం అవసరం లేదు అంజు నువ్వు పైకి వెళ్లి రెస్ట్ తీసుకో వెళ్లు అని చెప్తుంది. ఆరు మాత్రం మనును తిట్టుకుంటుంది. ఓసేయ్‌ రాక్షసి కన్న కూతురు కౌగిలి అడిగితే అసహ్యించుకుంటున్నావేంటే..? నువ్వు అసలు అమ్మవేనా..? అంటుంది. తనలోని అమ్మ తనం తన బిడ్డను వదిలేసినప్పుడే కనుమరుగు అయింది బాలిక అంటాడు గుప్త. అంజు మాత్రం ఫ్లీజ్‌ ఆంటీ మిమ్మల్ని ఒకసారి హగ్‌ చేసుకోవాలని ఉంది ఆంటీ అని అడుగుతుంది. ఆరు బాధగా ప్రపంచంలో ఏ పసిబిడ్డకు ఈ దుస్థితి రాకూడదు గుప్త గారు.. పిల్లలకు అమ్మ ఒడే ఊయల.. అమ్మ ముద్దే గోరు ముద్ద.. అమ్మ మాటే తొలి మాట. అమ్మ కౌగిలే ఆనంద లోగిలి.. ఆ విషయం ఈ దుర్మార్గురాలికి ఎప్పుడు అర్థం అవుతుందో ఏంటో.. అని బాధపడుతుంది.

ఆంజు ఫ్లీజ్ ఆంటీ ఒక్కసారి హగ్‌ చేసుకోనివ్వండి నన్ను అంటూ అడుగుగుతుంటే.. మనోహరి అయిష్టంగానే.. సరే అంటూ అంజును హగ్‌ చేసుకుంటుంది. అంజు హగ్‌ చేసుకుని అలాగే ఉండిపోతే అబ్బా ఎంత సేపే జలగలా నా రక్తం పూల్చింది చాలక మళ్లీ ఇలా హత్తుకున్నావేంటే..? అని మనసులోనే తిట్టుకుంటుంది. అంజు మాత్రం మిమ్మల్ని హగ్‌ చేసుకుంటే అచ్చం మా అమ్మను హగ్‌ చేసుకున్నట్టే ఉంది ఆంటీ అంటుంది. మీ అమ్మను చంపినట్టే నిన్ను కూడా చంపేయాలనుకున్నానే.. కానీ బతికిపోయావు అని మనసులో అనుకంటుంది. మా అమ్మ లేనందుకు బాధగా ఉన్నా మీరు ఉన్నందుకు హ్యపీగా ఉంది ఆంటీ అంటుంది అంజు. మీ అమ్మను చంపి దాని జీవితం తీసుకుందామనుకున్నాను. అది చచ్చింది కానీ నేను కోరుకున్నది ఏదీ ఇంకా  నాకు దక్కలేదు.  కనీసం నిన్ను చంపైనా భాగీని సైడ్‌ చేద్దామనుకున్నాను. కానీ నేనే రక్తం ఇచ్చి నిన్ను బతికించుకోవాలి అనుకున్నాను అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అంజు థాంక్యూ సోమచ్‌ ఆంటీ ఐలవ్‌ యూ అంటూ మనోహరిని కిస్‌ చేస్తుంది. మను చిరాకుగా లేస్తుంది.


ఆరు కోపంగా కన్న బిడ్డ స్పర్శను గుర్తు పట్టలేని తల్లి ఉంటుందా గుప్తగారు. ఆ బిడ్డ కౌగిలికి ముద్దుకు స్పందించని తల్లి  ఉంటుందా గుప్తగారు.. అంటూ అడగ్గానే.. ఉంటారు బాలిక నువ్వు నీ కళ్లారా చూస్తున్నావు కదా..? దీనినే విధి అంటారు. అని చెప్పగానే.. ఇదేం విధఙ గుప్తగారు.. మనుషుల ఎమోషన్స్‌ తో ఆడుకోవడమేనా..? విధి అంటే.. అసలు రాత్రి అనగా మా ఆయన భాగీ బయటకు వెళ్తారు. ఇంత వరకు రాలేదు అని అడుగుతుంది ఆరు. కంగారు పడకు బాలిక వచ్చేస్తారులే అని గుప్త నవ్వుతూ చెప్తాడు. తర్వాత అమర్‌, మిస్సమ్మ  ఇంటికి  వస్తారు. ఇంటికి వచ్చిన మిస్సమ్మ సిగ్గు పడుతూ బెడ్‌ రూంలోకి వెళ్తుంది.

వెనకే వచ్చిన అమర్‌ మెల్లగా మిస్సమ్మ దగ్గరకు వెళ్లి ముఖంలోకి చూస్తుంటాడు. ఇంతలో వారి వెనకే వచ్చిన మనోహరి డోర్‌ చాటు నుంచి అమర్‌, మిస్సమ్మలను గమనిస్తుంది. ఇంతలో అమర్‌ మెల్లగా మిస్సమ్మకు సారీ చెప్తాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. అమర్‌ ఎందుకు సారీ చెప్తున్నాడు.. అసలు సారీ చెప్పాల్సిన తప్పు అమర్‌ ఏం చేశాడు అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ మాత్రం సిగ్గు పడుతూనే సారీ ఎందుకండి నేను ఇప్పుడే మీకు పరిపూర్ణంగా భార్యను అయ్యాను అని చెప్తుంది. మిస్సమ్మ మాటలకు మనోహరి బాధపడుతుంది. ఇక ఇద్దరి మధ్య పిజికల్‌ రిలేషన్‌ కూడా మొదలైంది అన్నమాట అని ఇరిటేటింగ్‌ గా పీలవుతుంది.

ఇన్ని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్‌ కాలేకపోయాను.. ఇవాళ నేనే వాళ్లిద్దరిని కలిసేలా చేశానా..? అనవరసంగా ఆ నాగు గాణ్ని పంపించానా..? అసలు ఎందుకు నా ప్లాన్స్‌ అన్ని బెడిసికొడుతున్నాయి అని బాధపడుతూనే అక్కడే నిలబడి అమర్‌, మిస్సమ్మ మాటలు వింటుంది. ఇక మిస్సమ్మ మనసా వాచ కర్మణా త్రికరణ శుధ్దిగా ఇప్పుడు నేను మీ సహధర్మచారిణిని. నన్ను ప్రేమతో పూర్తి హక్కుతో మీ భార్యను చేసుకున్నారు అంటూ మిస్సమ్మ, అమర్ ను హగ్‌ చేసుకుంటుంది. మనోహరి కోపంతో రగిలిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Deepthi Manne: ‘జగద్ధాత్రి’ సీరియల్ హీరోయిన్‌ పెళ్లి సందడి షురూ.. హల్తీ ఫోటోలు వైరల్!

Illu Illalu Pillalu Today Episode: నర్మద, వేదవతి మధ్య గొడవ.. ధీరజ్ కు దిమ్మతిరిగే షాక్.. పారిపోయిన భాగ్యం..

Brahmamudi Serial Today November 6th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీ గురించి నింజ తెలుసుకున్న రాహుల్‌

GudiGantalu Today episode: బాలు, మీనా మాటలతో షాక్.. ప్రభావతికి టెన్షన్ టెన్షన్.. సుశీల రాకతో హ్యాపీ..

Nindu Noorella Saavasam Serial Today November 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కడుపులో పిండాన్ని చంపలేమన్న చంభా

Intinti Ramayanam Today Episode: పల్లవిని అవమానించిన ఫ్రెండ్.. చక్రధర్ పై పల్లవి సీరియస్.. మీనాక్షికి షాక్..

Gundeninda Gudigantalu Prabhavathi : ప్రభావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా..? కూతురు, కొడుకుతో కలిసే ఆ పని..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వాటిని మిస్ అవ్వకండి..

Big Stories

×