Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం ఆయన మార్క్ ను సృష్టించకపోయినా.. పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ఓజీ(OG) . ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సెప్టెంబర్ 25వ తేదీన రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం వేదికగా ఘనంగా నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యేలా చేసింది. ముఖ్యంగా స్టేజ్ పై ఆయన చేసిన విన్యాసాలు అందరిలో వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. ఒక అధికారి అయ్యుండి సినిమా ఈవెంట్లలో కత్తి పట్టి అలా చేయడం కరెక్ట్ గా లేదు అంటూ కొంతమంది కామెంట్లు చేశారు. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వేసుకున్న జంధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఈవెంట్ కి హాజరైన పవన్ కళ్యాణ్ ..ఆయన వేసుకున్న షర్టు కాస్త ట్రాన్స్పరెంట్ కావడంతో ఆయన ధరించిన జంధ్యం కాస్త బయటపడింది.
ALSO READ:Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!
పవన్ ధరించిన జంధ్యం దేనితో తయారు చేశారో తెలుసా?
అయితే జంధ్యం అందరూ వేసుకుంటారు కదా ఇందులో ఆశ్చర్యం ఏముంది ? అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయన ధరించిన జంధ్యాన్ని బంగారంతో చేశారు. ఈ విషయం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జంధ్యం కూడా బంగారంతో చేయించిందా అంటూ నోరెళ్ళబెడుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఇలా ప్రజలకు సహాయం చేస్తాను అని, ప్రజల కోసమే సినిమాలు చేస్తున్నానని.. గతంలో పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి ఈయన ఇప్పుడు జంధ్యాన్ని బంగారంతో తయారు చేయించి ధరించారు అంటే.. వెనకాల ఆస్తులు ఏ రేంజ్ లో దాచిపెట్టారో అర్థమవుతుంది అంటూ కొంతమంది యాంటీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎలాంటి వివరణ ఇస్తారు? అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం. తన దగ్గర డబ్బులే లేవు.. తన జీవితం ప్రజలకే అంకితం అంటూ చెప్పుకు తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఇలా బంగారం ధరించే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం.
ఓజీ సినిమా విశేషాలు..
ఓజీ సినిమా విషయానికి వస్తే.. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. శ్రేయ రెడ్డి , ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.