Medipally Incident: మేడ్చల్‌లోని నారపల్లిలో ర్యాగింగ్ భూతానికి బలయ్యాడు ఓ విద్యార్ధి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జాదవ్ సాయి తేజ.. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. కళాశాలలో ర్యాగింగ్‌కు గురవడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. సీనియర్ విద్యార్ధులు మద్యం తాగించాలని ఒత్తిడి చేశారని తెలుస్తోంది. మృతుడి ఆత్మహత్యకు కారణం ర్యాగింగ్ మాత్రమేనా లేదా ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే సాయితేజ కుటుంబం, స్నేహితులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణం సీనియర్ల ర్యాగింగ్ అని చెబుతున్నారు. కళాశాలలో చేరిన కొద్ది రోజుల్లోనే సీనియర్లు అతనిపై మద్యం తాగమని ఒత్తిడి చేశారు. సాయితేజ్ మద్యం తాగడానికి మానసికంగా సిద్ధంగా లేకపోవడంతో, వారు అతన్ని బార్‌లోకి తీసుకెళ్లి బలవంతంగా తాగించారు. ఆ రాత్రి బార్ బిల్ రూ.15,000కి చేరింది. ఈ బిల్ చెల్లించమని సీనియర్లు సాయితేజ్‌పై తీవ్ర వేధింపులు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను, తన మొబైల్‌లో వీడియో రికార్డు చేసుకున్నాడు. ఆ వీడియోలో సీనియర్ల వేధింపులు, మద్యం బలవంతం, బిల్ ఒత్తిడి గురించి వివరించి, తల్లిదండ్రులకు “సారీ అమ్మా, నాన్న” అంటూ బై-బై చెప్పుకున్నాడు. ఆ తర్వాత హాస్టల్‌లోనే ఉరి వేసుకున్నాడు. స్నేహితులు ఈ వీడియోను పోలీసులకు అందించారు. వారు సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. “సాయి మా స్నేహితుడు చాలా చదువుకోవడానికి ఆసక్తి చూపేవాడు. ర్యాగింగ్ వల్లే ఇలా చేసుకున్నాడు” అని ఒక స్నేహితుడు తెలిపాడు.
అయితే, పోలీసులు ర్యాగింగ్ మాత్రమే కారణమా అని లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాయితేజ్ తల్లిదండ్రులు ఆదిలాబాద్‌లోనే వ్యవసాయం చేస్తున్నారు. అతను ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఈ కళాశాలలో చేరాడు. కళాశాల నుంచి ఇంకా అధికారిక ప్రతిస్పందన రాలేదు, కానీ యాజమాన్యం ర్యాగింగ్‌ను తప్పుబట్టుకుంటూ, విచారణకు సహకరిస్తామని పోలీసులకు తెలిపింది. ఈ ఘటన తెలంగాణలో ర్యాగింగ్ సమస్యను మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. గత 5.5 సంవత్సరాల్లో ర్యాగింగ్ వల్ల 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు UGC డేటా తెలిపింది. అయితే సాయితేజ్ మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు “మా కొడుకు కలలు, భవిష్యత్తు అంతా దూరమైంది. ర్యాగింగ్‌ను ఆపాలి” అంటూ విలపిస్తున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..
సాయితేజ్ మరణంతో అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు “మా కొడుకు కలలు, భవిష్యత్తు అంతా దూరమైంది. ర్యాగింగ్‌ను ఆపాలి” అంటూ విలపిస్తున్నారు.ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్ధులు చదువుకోవడానికి కాలేజీలకు వస్తున్నారా.. మందు తాగడానికి వస్తున్నారా.. అని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. చదువుకొని వృద్ధిలోకి రావాల్సిన వారు ఇలా చెడు వ్యసనాలకు బానిసలవ్వడంపై విమర్శలు రేగుతున్నాయి. విద్యార్దులు ఇలా చెడుదారిన పట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బలి
మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జాదవ్ సాయితేజ
మద్యం తాగాలని ఒత్తిడి చేసిన సీనియర్లు
ఆపై బార్లో రూ.15 వేల బిల్లు చెల్లించాలని వేధింపులు
దీంతో తీవ్ర మనస్థాపానికి గురై, వీడియో రికార్డు చేసి… pic.twitter.com/NeYxpIhtv9
— BIG TV Breaking News (@bigtvtelugu) September 22, 2025