Dishwasher Work Easy| చాలా మంది గృహిణులకు ఇంట్లో వంట పాత్రలు శుభ్రం చేయడం భారంగా అనిపిస్తుంది. అందుకే ఇలాంటి పనుల కోసం ఓ పనిమనిషిని చాలా మంది నియమించుకుంటారు. కానీ పనిమనిషులు చాలా సార్లు చెప్పా పెట్టకుండా పనిమానేస్తారు. లేదా ప్రతిరోజు పనిచేయడానికి రారు. దీంతో ఇబ్బుందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో పనిమనిషి లేకుండా పాత్రలు ఎలా కడుగుకుంటామని మీరు ఆలోచిస్తుంటే, ఎక్కువగా ఆలోచించకండి. ఈ డిష్‌వాషర్ మీ అన్ని పనులను సులభతరం చేస్తుంది. పనిమనిషి లేకున్నా.. ఈ యంత్రం మీ డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఒక డిష్‌వాషర్ ఏ వంటగదిలోనైనా సులభంగా సరిపోతుంది. ఇది 4 లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వంట పాత్రలను చేతితో శుభ్రం చేస్తే కలిగే ఇబ్బందులు డిష్‌వాషర్ ఉపయోగించడం వల్ల తొలగిపోతాయి. వివిధ రకాల పాత్రలను నిల్వ చేయడానికి ఇందులో తగినంత స్థలం కూడా ఉంది.
డిష్‌వాషర్లతో ప్రయోజనాలు:
మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త డిజైన్ డిష్ వాషర్ల గురించి తెలుసుకుందాం. ఈ డిష్‌వాషర్ యంత్రాలు పాత్రలకు ఏవైనా జిడ్డు ఉంటే దాన్ని సులభంగా కడిగేస్తుంది. ఆ విధంగానే ఈ యంత్రాలను రూపొందించారు. దీనిలో ఉతికిన పాత్రలు బ్యాక్టీరియా రహితంగా ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ డిష్‌వాషర్లు దాదాపు ప్రతి ఒక్కరికీ అవసరంగా మారాయి. వీటిని మీ వంటగదిలో సులభంగా అమర్చవచ్చు. ఆన్‌లైన్‌లో డిష్‌వాషర్‌లను ఎంతకు పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
Also Read: మీ గార్డెన్‌లోని మొక్కలతో కరెంట్ పొందొచ్చు.. ఎలాగో తెలుసా?
తోషిబా 14 ప్లేస్ సెట్టింగ్స్:
మీరు ఈ డిష్‌వాషర్‌ను 15 శాతం తగ్గింపుతో కేవలం రూ. 33,990 కి పొందవచ్చు. మీరు ఒకేసారి అంత డబ్బు చెల్లించలేకపోతే మీరు Amazonలో నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా పొందుతారు. దీని వలన మీకు నెలకు రూ. 1,648 మాత్రమే ఖర్చవుతుంది. ఈ డిష్‌వాషర్ అదనపు డ్రై కెపాసిటీతో వస్తుంది. ఇది మీ పాత్రలను కడిగి ఆరబెట్టగలదు. పాత్రలకు అంటుకున్న సుగంధ ద్రవ్యాల మరక, నూనె, నేయి, కూరల మరకలను సులభంగా తొలగించగలదు.
ఫాబెర్ 12 ప్లేస్ సెట్టింగ్స్ డిష్‌వాషర్:
ఈ యంత్రంలో మీరు నిమిషాల్లో అనేక పాత్రలను కడగవచ్చు. మీరు దీన్ని 27 శాతం తగ్గింపుతో కేవలం రూ. 29,210 కి పొందుతారు. ఇది పోర్టబుల్ ఫీచర్‌తో వస్తుంది. 12 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. మీకు రూ.30 వెల నుంచి నుండి రూ. 40,000 ధరలో మంచి డిష్ వాషర్ మెషీన్లు లభిస్తున్నాయి. వాటిలో మీ బడ్జెట్ కు తగిన దాన్ని ఎంచుకోండి. Croma, Flipkart, Amazon,.. వంటి ఇతర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల లో కూడా ఈ డిష్ వాషర్లు అందుబాటులో ఉన్నాయి.