Bigg Boss 9: మర్యాద మనీష్ (Maryada Manish).. బిగ్ బాస్ (Bigg Boss) పుణ్యమా అని ఒక్కసారిగా కామనర్ కాస్త సెలబ్రిటీ అయిపోయారు. అలా ‘అగ్నిపరీక్ష’ షోలో తన సత్తా ఏంటో చాటి జడ్జిలు మెచ్చిన కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ప్రత్యేకంగా అడుగుపెట్టారు మనీష్. తన పర్ఫామెన్స్ తో అందరినీ అలరించిన ఈయన.. ఇంకొంత కాలం హౌస్ లో ఉంటారు అనుకోగా.. అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.. వాస్తవానికి ఈవారం నామినేషన్స్ లోకి మర్యాద మనీష్ వచ్చినా.. ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుందని , ఆమెను భరించడం ఎవరి వల్ల కావడం లేదు అంటూ అటు ఆడియన్స్ కూడా కామెంట్లు చేశారు. దీంతో ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుందని దాదాపు అందరూ కన్ఫామ్ కూడా అయిపోయారు. కానీ అనుకోకుండా శుక్రవారం రోజు ప్రియా శెట్టికి ఓట్లు బాగా పెరగడంతో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు.
హౌస్ నుండి ఆయన బయటకు రావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే మనీష్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీడియో విషయానికి వస్తే.. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన “మీలో ఎవరు కోటీశ్వరులు” కార్యక్రమానికి మనీష్ గెస్ట్ గా హాజరయ్యారు. అందులో తన గుండు సీక్రెట్ ను కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
also read:Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. ఇలా ఎప్పుడైనా చూశారా.. మెంటలెక్కిపోతుంది మావా
గుండు సీక్రెట్ రివీల్ చేసిన మనీష్..
వీడియో విషయానికి వస్తే.. మీలో ఎవరు కోటీశ్వరులు సీజన్ 5.. 7వ ఎపిసోడ్ లో పాల్గొన్న మర్యాద మనీష్ తో హోస్ట్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఏంటి ఆ గడ్డం, హెయిర్ స్టైల్ వెనకాల కథ ఏంటి?” అని ఎన్టీఆర్ అడగగా.. మనీష్ మాట్లాడుతూ..” నేను కాలేజీలో ఉన్నప్పుడు 19, 20 సంవత్సరాల వయసులోనే నాకు హెయిర్ ఫాల్ అవ్వడం మొదలయ్యింది. తోటి స్నేహితులందరూ జుట్టు రాలిపోవడాన్ని ఎక్కువగా నోటీస్ చేసేవాళ్ళు. దాంతో నాలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా పోయింది. అప్పుడు నాకు నేనే ఒక మూడు ప్రశ్నలు వేసుకున్నాను. అందులో మొదటిది జుట్టు అవసరమా? జుట్టు లేకపోయినా ఉండగలవా? జుట్టు లేకపోతే నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ని వదిలి వెళ్ళిపోతారని భావిస్తున్నావా? అని ఇలా నాకు నేనే మూడు ప్రశ్నలు వేసుకున్నాను.
సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరిగింది అంటూ..
ఆ తర్వాత అన్నింటికీ నాకు నేనే సమాధానం చెప్పుకొని.. గత 15 సంవత్సరాలుగా బార్బర్ షాప్ కి వెళ్తూ వెళ్లిన ప్రతిసారి ఇలా గుండు గీయించుకుంటున్నాను. అయితే గుండు గీయించుకున్నప్పుడు కూడా కొంతమంది నన్ను నోటీస్ చేశారు. కానీ ఒక మూడు, నాలుగు నెలల తర్వాత అలా నోటీస్ చేయడం మానేశారు. ఇప్పుడు నాలో కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా పెరిగిపోయాయి . ఏదైనా సరే ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నాను” అంటూ మనీష్ చెప్పకొచ్చారు. మనీష్ కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కూడా మనీష్ లుక్కు పై ప్రశంసలు కురిపించారు. ఏది ఏమైనా మనలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి అంటే పక్క వాళ్ళ మాటలు వినకూడదని, మనకు నచ్చింది మనం చేయాలి అని మనీష్ ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు.
?utm_source=ig_web_copy_link