Pawan Kalyan: రాజకీయాల్లోకి వచ్చాకా ఫ్యాన్స్ అందరూ వింటేజ్ పవన్ కళ్యాణ్ ను మిస్ అవుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు కలర్ కలర్ డ్రెస్ లు, హెయిర్ స్టైల్స్ అంటూ రోజుకో లుక్ లో కనిపించేవాడు. సినిమా రిలీజ్ అంటే కనీసం లో కనీసం ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కనిపించేవాడు. కానీ, ఎప్పుడైతే పవన్ పాలిటిక్స్ లో వచ్చాడో అవన్నీ బంద్ అయ్యాయి. అంతేనా అసలు సినిమాలే తక్కువ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ ను వింటేజ్ లుక్ లో చూడాలని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలవాలని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూశారు. ఫ్యాన్స్ ఆశలను, కోరికను డైరెక్టర్ సుజీత్ నిజం చేశాడు. సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న చిత్రం ఓజీ. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25 న రిలీజ్ కు సిద్దమవుతుంది.
ఇప్పటికే ఓజీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ ను కూడా క్రియేట్ చేసింది. ఇక గతరాత్రి ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించాడు. ఓజాస్ గంభీరగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో చేతిలో పెద్ద కత్తితో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
మునుపెన్నడూ లేని విధంగా పవన్ ఇంత హుషారుగా.. జోష్ తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. అయితే పవన్ చేసిన హడావిడి చూస్తే కొద్దిగా ఓవర్ అనిపించింది అనేది కొందరి అభిప్రాయం. ఆ కత్తి పట్టుకొని తిరగడం, అరవడం.. వర్షంలో సెక్యూరిటీని పక్కకు తోసి మనల్ని వర్షం ఆపుతుందా అని మాట్లాడడం.. ఇవన్నీ అభిమానులకు కొంచెం కొత్తగా.. ఇంకొంతమందికి ఓవర్ గా అనిపించాయి.
ఇన్నేళ్ళలో పవన్ ను ఎప్పుడు ఎవరు ఇలా చూడలేదు. అందుకే అలా అనిపించిందా.. ? ఇదంతా చేయమని సుజీత్ చెప్పాడా.. ? లేక పవనే ఫ్యాన్స్ ను ఉత్తేజపర్చడానికి ఇలా చేశాడా. ? అనేది తెలియదు కానీ, పవన్ చేసిన పనులు మాత్రం చాలా ఓవర్ గా అనిపించాయి. దీంతో నెటిజన్స్ పవన్ ఇది కొంచెం ఓవర్ గా అనిపించలేదా అని డైరెక్ట్ గా చెప్పుకొస్తున్నారు.
ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషి.. కనీసం ఒక ఈవెంట్ కు వస్తే ఒక దగ్గర కూర్చోవడం తప్ప పక్కకు కూడా కదలని మనిషి.. ఇలా తన ఈవెంట్ లో ఇంత రచ్చ చేశాడు అంటే నమ్మడం కొంచెం కష్టమే అయినా కూడా ఫ్యాన్స్ కోసం పవన్ ఇది చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పవన్ ఇలా మారడానికి కారణం సుజీత్, థమన్ అని అందరికీ తెల్సిందే. ఇదే విషయం పవన్ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ తప్పేమి లేదు అని చెప్పొచ్చు. ఏదిఏమైనా ఓజీ ఈవెంట్ లో పవన్ ఉన్నట్లు ఇంకెప్పుడు ఎక్కడ కనిపించడు అనేది మాత్రం వాస్తవం. అందుకే ఓవర్ అయినా కూడా ఫ్యాన్స్ దాన్ని ఎంజాయ్ చేశారు. మరి ఓజీ సినిమాతో పవన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.