Wireless Charging : స్మార్ట్ ఫోన్లతో చేసే పనులు బోలేడు. పలు సర్వీసెస్ కోసం ఎన్నో యాప్‌లతో రోజూ పని పడుతుంది. దీంతో ఎక్కడ బ్యాటరీ నిండుకుంటుందోననే ఆలోచన యూజర్స్‌కు ఎక్కువగా ఉంటుంది. పైగా తిరిగి ఛార్జ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇదే కాకుండా ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ లేదా ఛార్జర్ త్వరగా, ఎక్కువగా హీట్ అయిపోతుండటం అనే సమస్యను కూడా ఎదుర్కొంటుంటాం.
అందుకే రోజు రోజుకీ ఫోన్, అందులోని యాప్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సమస్యల్ని అధిగమించేలా మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త బ్యాటరీ, ఛార్జర్ల సాంకేతికతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తి బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్‌తో ఛార్జర్లను తీసుకొస్తున్నాయి.
పైగా యూజర్స్ కూడా ప్రస్తుతం కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నామంటే ఫీచర్స్‌తో పాటు తప్పని సరిగా బ్యాటరీ ఎంత వేగంగా చార్జ్ అవుతుందనేది చూస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో వైర్లెస్ ఛార్జింగ్‌లు కూడా వచ్చేశాయ్ అన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ వైర్‌లైస్ ఛార్జింగ్ వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ డ్యామేజ్ అవుతుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇంకా ఫోన్ ఎక్కువ కాలం మన్నికరాదని.. త్వరగా లైఫ్ అయిపోయే అవకాశం ఉందనే వాదనలు సైతం వినివిపిస్తున్నాయి. అయితే అది పక్కా అని చెప్పలేం కానీ, వైర్లెస్ ఛార్జర్ తో లాభాలు అయితే చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ ఛార్జర్ ఎలా పని చేస్తుందనేది ఓ సారి తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్లో వైర్లెస్ ఛార్జింగ్ వర్క్ చేయాలంటే.. ఛార్జర్, అలాగే మీ డివైస్‌లో కాయిల్స్ ప్రత్యేకంగా డిజైన్డ్ చేయబడి ఉంటాయి. దాదాపుగా అన్నీ వైర్ లైస్ ఛార్జింగ్ ఫోన్స్, కరెంట్ ఫ్లోలో హెచ్చు తగ్గులను నియంత్రించేందుకు ప్రొటెక్షన్ ఫీచర్స్‌తోనే వస్తుంటాయి.
అయితే ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్‌కు కామన్ ప్రాబ్లమ్ ఛార్జర్ పెట్టడం వల్ల స్మార్ట్ ఫోన్‌తో పాటు ఛార్జర్ ఎక్కువగా హీట్ అయిపోతుంటుంది. తద్వారా రేడియేషన్ రావడం, స్మార్ట్ ఫోన్ పని తీరుపై ప్రభావం చూపించడం వంటివి జరుగుతుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకే వైర్లెస్ ఛార్జర్లు, ఛార్జింగ్ యొక్క స్పీడ్‌ను ఆటోమెటిక్‌గా మేనేజ్ చేస్తుంటాయి.
స్పీడ్ ఛార్జింగ్ విషయానికొస్తే వైర్ ఛార్జర్ అంత స్పీడ్‌గా వైర్లెస్ ఛార్జర్లో ఛార్జింగ్ అవ్వకపోవచ్చు. లేదంటే మీకు కాస్త ఎక్కువ స్పీడ్‌గా వైర్లెస్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ ఎక్కాలంటే అవి మన్నికమైనవి, నాణ్యతమైనవి ఉండాలి. మొత్తంగా మీ బ్యాటరీ లైఫ్ బాగుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
బ్యాటరీ లైఫ్ పెంచే టిప్స్ –
⦿ బ్యాటరీ ఛార్జింగ్ ను 20 నుంచి 80 శాతం మధ్య బ్యాలెన్స్ చేస్తుండాలి.
⦿ ఫాస్ట్ ఛార్జింగ్ కొన్ని సార్లు మీ డివైస్‌పై నెగటివ్ ఎఫెక్ట్స్‌ను చూపిస్తుంది. కాబట్టి మీరు తరచుగా ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్లను వాడకూడదు.
⦿ అలానే ఫోన్ బ్యాటరీని డ్యామేజ్ చేసే చీప్ ఛార్జలను వాడకూడదు.
⦿ ఒక ఫోన్ చార్జర్ ను మరో ఫోన్ కు ఉపయోగించకపోవటమే మంచిది
⦿ ఫోన్ ను ఎక్కువసేపు చార్జింగ్ లో ఉంచకూడదు
⦿ బ్యాటరీ కెపాసిటీకి తగిన ఛార్జ్ ను ఉపయోగించాలి
⦿ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడకూడదు
ALSO READ : వావ్.. మింత్రా అదిరే అప్డేట్.. ఆర్డర్ చేస్తే 2 గంటల్లోనే డెలివరీ