Myntra : బెంగళూరుకు చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్ ఈ కామర్స్ సంస్థ మింత్రా త్వరలోనే క్విక్ కామర్స్ లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షల్లో వినియోగదారుల్ని సంపాదించుకున్న మింత్రా.. త్వరలోనే కస్టమర్స్ కు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ఈనేపథ్యంలో రెండు గంటల్లోనే ఆర్డర్లను డెలివరీ చేసే విధంగా సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక సేవలను సైతం బెంగుళూరులో మొదలుపెట్టింది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మింత్రాకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సంస్థ ప్రొడక్ట్స్ కు మంచి పేరు ఉండటంతో సేల్స్ సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి. కస్టమర్స్ ని మరింత ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న మింత్రా.. కేవలం రెండు గంటల్లోనే ఆర్డర్లను డెలివరీ చేసే విధంగా సన్నాహాలు మొదలు పెట్టేసింది. ఎంపిక చేసిన పిన్ కోడ్స్ లో ఈ సేవలు ఉంటాయని తెలిపింది. ఎంపిక చేసిన ప్రోడక్ట్లను మాత్రమే ఈ పైలెట్ ప్రాజెక్టు కింద అందిస్తామని తెలిపిన మింత్రా.. ఇప్పటికే ప్రయోగాత్మక సేవలను బెంగళూరు నగరంలో మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.
ALSO READ : రూమ్ సౌండ్ బట్టి మారిపోయే మ్యూజిక్.. ఇంకా ఎన్నో అదిరే ఫీచర్స్!
ఇక మింత్రా సేవలను మరింతగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకొచ్చిన ఆ సంస్థ 2022లో మెట్రో నగరాల్లో మొదలు పెట్టిన మింత్రా ఎక్స్ ప్రెస్ డెలివరీ సేవలకు మంచి డిమాండ్ వచ్చిందని తెలిపింది. ఇక నిజానికి మింత్రా ఎక్స్ ప్రెస్ సేవలు మొదలైనప్పటి నుంచి ఈ యాప్ కు మరింత డిమాండ్ పెరిగింది. ఆర్డర్ పెట్టిన 24 నుంచి 48 గంటల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయడమే ఈ సేవల ముఖ్య ఉద్దేశం. గ్రోసరీ విభాగంలో ఇప్పటికే ఈ కామర్స్ సేవలను విస్తరించిన మింత్రా.. తాజాగా షాపింగ్ రంగంలో సైతం ఈ సేవలను మరింత పెంచేందుకు సిద్ధమవుతుంది. బ్యూటీ, ఫ్యాషన్ క్యాటగిరీలను చేర్చుకుంటూ ఈ క్విక్ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయే.. ఏయే నగరాల్లో అందుబాటులో ఉండనున్నాయో అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా ఈ విషయం మింత్రా వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ ఒకదానికొకటి పోటీ పడుతూ ఆఫర్స్ ను సైతం పెంచేస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా, మీషో, ఏ జియో వంటి ఫ్లాట్ ఫ్లామ్స్ తమ కస్టమర్స్ కు అదిరే ఆఫర్స్ ను అందిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మింత్రా తీసుకురాబోతున్న ఈ ఆఫర్ మరింత మంది కస్టమర్స్ ను ఆకట్టుకుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే
ALSO READ : జియో పతనం మెుదలైందా! ఒక్క నెలలోనే 79.6 లక్షల వినియోగదారులు అవుట్..