E-Paper
Advertisement

Honor Magic V3: అల్లాడించే ఫోన్.. 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో హానర్ మ్యాజిక్ వి3.. తట్టుకోవడం కష్టమే..!

Honor Magic V3: అల్లాడించే ఫోన్.. 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో హానర్ మ్యాజిక్ వి3.. తట్టుకోవడం కష్టమే..!
Advertisement

Honor Magic V3: హానర్ త్వరలో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. తన లైనప్‌లో ఉన్న Honor Magic V3 ఫోల్డబుల్ మొబైల్‌ను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కంపెనీ ఇటీవలే ఈ స్మర్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు దాని గ్లోబల్ మోడల్ బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారమ్‌లో గుర్తించబడింది. ఈ ఫోన్‌లో 12 GB RAM ఉండవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా ఇది Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌లో వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు ఇంకా చాలా స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Honor Magic V3 అనేది కంపెనీకి చెందిన ప్రసిద్ధ ఫోల్డబుల్ ఫోన్. ఈ బ్రాండ్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ఫోన్ తాజాగా బెంచ్‌మార్క్ సర్టిఫికేషన్‌ను పొందింది. దీని ప్రకారం.. హానర్ మ్యాజిక్ V3 గ్లోబల్ మోడల్ బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారమ్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఇక్కడ మోడల్ నంబర్ FCP-N49తో Honor Magic V3 ఫోన్ దర్శనమిచ్చింది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 3 SoC ప్రాసెసర్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

ఇది ఎనిమిది-కోర్ చిప్‌సెట్‌తో రానుంది. హానర్ మ్యాజిక్ V3 గ్లోబల్ వేరియంట్‌లో 12GB RAM ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ కోసం Adreno 750 GPU ఇందులో అందించారు. ఇది కాకుండా ఈ Honor Magic V3 ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ OS 8.0 తో వస్తుంది. సింగిల్ కోర్ పరీక్షలో ఫోన్ 1914 పాయింట్లు సాధించింది. మల్టీ కోర్ టెస్ట్‌లో 5354 పాయింట్లు సాధించింది. ఇక ఈ గ్లోబల్ వేరియంట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి ఉంది.

 Also Read: అల్లాడించే మ్యాజిక్ ఫోన్.. డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీతో హానర్ వచ్చేస్తుంది.. ఇక సూస్కో మావా

Advertisement

Honor Magic V3 చైనీస్ వేరియంట్ విషయానికొస్తే.. ఫోన్ 7.92 అంగుళాల ప్రైమరీ FHD+ LTPO OLED డిస్‌ప్లే, 6.43 అంగుళాల LTPO OLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు స్క్రీన్‌లు గరిష్ట ప్రకాశం 5,000 నిట్‌ల వరకు ఉంటాయి. ఫోన్ 16GB LPDDR5x RAM + 512GB UFS 4.0 స్టోరేజ్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో అమర్చబడింది. ఇది Android 14 ఆధారంగా MagicOS 8.0.1 పై రన్ అవుతుంది. హానర్ మ్యాజిక్ V3 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 40-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో ఇది 40-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉంది. ఫోన్ 66W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,150mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×