BigTV English

Honor Magic V5 Periscope: హానర్ మ్యాజిక్ V5.. వచ్చేస్తోంది అత్యాధునిక పెరిస్కోప్ కెమెరాతో సన్నని ఫోల్డబుల్ ఫోన్

Honor Magic V5 Periscope: హానర్ మ్యాజిక్ V5.. వచ్చేస్తోంది అత్యాధునిక పెరిస్కోప్ కెమెరాతో సన్నని ఫోల్డబుల్ ఫోన్

Honor Magic V5 Periscope Telephoto Camera| హానర్ మ్యాజిక్ V5 స్మార్ట్‌ఫోన్ జూలై 2, 2025న చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ గురించి హానర్ సంస్థ సోషల్ మీడియా ద్వారా టీజర్‌లను విడుదల చేసింది. ఈ టీజర్‌లో దాని డిజైన్, ఫీచర్‌లను వెల్లడించింది. తాజా టీజర్‌లో, ఈ ఫోన్‌లో అత్యాధునిక 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుందని హానర్ ప్రకటించింది. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) టెలిఫోటో మాక్రో ఫోటోగ్రఫీ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఫోల్డబుల్ ఫోన్‌లలో ఇది అత్యధిక రిజల్యూషన్ కలిగిన పెరిస్కోప్ కెమెరాగా హానర్ పేర్కొంది. గత సంవత్సరం హానర్ మ్యాజిక్ V3లో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఉంది, కాబట్టి దాంతో పోలిస్తే. ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అనే చెప్పాలి.


కెమెరా ఫీచర్‌లు
పెరిస్కోప్ కెమెరాతో పాటు, ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండవచ్చని సమాచారం. ఈ ట్రిపుల్ రియర్ (వెనుకవైపు) కెమెరా సెటప్ అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాక, ఈ ఫోన్‌లో హానర్ లుబాన్ షాక్-అబ్జార్బింగ్ హింజ్ ఉంటుంది. ఇది డ్రాప్-రెసిస్టెంట్, ఇన్నర్ స్క్రీన్‌పై విదేశీ వస్తువులను గుర్తించే AI ఆధారిత ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

హానర్ మ్యాజిక్ V5 వివరాలు
ఈ ఫోన్ జూలై 2న చైనాలో లాంచ్ అవుతుంది మరియు 6,100mAh బ్యాటరీతో వస్తుంది. ఫోల్డబుల్ ఫోన్‌లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ కల ఫోన్. ఇది డాన్ గోల్డ్, సిల్క్ రోడ్ డన్‌హువాంగ్, వెల్వెట్ బ్లాక్, వార్మ్ వైట్ అనే నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ర్యామ్ స్టోరేజ్ ఆప్షన్లలో 12GB + 256GB, 16GB + 512GB, 16GB + 1TB వేరియంట్లు ఉన్నాయి.


ఈ ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు కేవలం 8.8mm మందంతో, ప్రపంచంలోనే అతి సన్నని, తేలికైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని, IPX8 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయని లీక్‌లు సూచిస్తున్నాయి. ఫోన్‌లో 6.45-ఇంచ్ LTPO OLED కవర్ స్క్రీన్, 8-ఇంచ్ 2K ఇన్నర్ డిస్‌ప్లే ఉంటాయి. ఇది 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది మరియు బరువు 217 గ్రాములుగా ఉంటుందని అంచనా.

Also Read: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. త్వరలోనే కొత్త ఛార్జీలు వసూలు

ఈ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7కి గట్టి పోటీనిస్తుంది. సన్నని డిజైన్, శక్తివంతమైన కెమెరా, పెద్ద బ్యాటరీ, AI ఫీచర్‌లతో, హానర్ మ్యాజిక్ V5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉంది. జూలై 2న లాంచ్ ఈవెంట్‌లో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి, ఇది టెక్ ప్రియులకు ఒక ఎగ్జైంటింగ్ విషయం.

Related News

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Big Stories

×