 
					యూజర్లు మరింత సేఫ్ గా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం సామ్ సంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఇంటర్నెట్ బ్రౌజర్ ను తయారు చేసింది. తాజాగా ఈ బ్రౌజర్ PC వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ బ్రౌజర్ ప్రస్తుతం దక్షిణ కొరియా, అమెరికాలోని వినియోగదారుల కోసం బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది. 2023లో పరిమితంగా సంఖ్యలో Windows యూజర్లకు అందుబాటులో ఉండగా, రాబోయే నెలల్లో మరిన్ని దేశాలల్లో యాక్సెస్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.
సామ్ సంగ్ తాజాగా విడుదల చేసిన బీటా వెర్షన్ ను ప్రయత్నించాలనుకునే వినియోగదారులు వారి సామ్ సంగ్ అకౌంట్ ను ఉపయోగించి సామ్ సంగ్ డెవలపర్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత బీటా పేజీలో అందించిన డౌన్ లోడ్ లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు. సౌత్ కొరియా, అమెరికా బయట ఉన్నవారికి, ఇన్ స్టాలేషన్ ఫైల్ ప్రత్యామ్నాయ డౌన్ లోడ్ లింక్ ల ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బ్రౌజర్ Windows 10, Windows 11లో రన్ అవుతుంది.
పర్సనల్ కంప్యూటర్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సామ్ సంగ్ బ్రౌజర్.. తన మొబైల్ వెర్షన్ లో అందుబాటులో ఉన్న అనేక టూల్స్ ను అందిస్తుంది. ఇందులో థర్డ్ పార్టీ కుక్కీలు, ట్రాకర్లను బ్లాక్ చేయడానికి స్మార్ట్ యాంటీ ట్రాకింగ్, బ్లాక్ చేయబడిన అంశాలను పర్యవేక్షించడానికి, బ్రౌజింగ్ డేటాను మెయింటెయిన్ చేయడానికి ప్రైవసీ డాష్‌బోర్డ్ ఉన్నాయి. వినియోగదారులు ప్రతిరోజూ ఎన్ని ట్రాకర్లను అడ్డుకున్నాయో చూసుకునే అవకాశం ఉంటుంది. వాటి ఆధారంగా తదుపరి సేఫ్ గా బ్రౌజింగ్ చసుకునే అవకాశం ఉంటుంది.
ఇక సామ్ సంగ్ బ్రౌజర్ లో అదనంగా బ్రౌజింగ్ అసిస్ట్ ఫీచర్ ఉంటుంది. ఈ AI టూల్ అనేక భాషలలో వెబ్‌పే జీలను ట్రాన్స్ లేట్ చేస్తుంది. ఆన్ లైన్ కంటెంట్ ను సులభంగా అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది. సామ్ సంగ్ పాస్ ద్వారా వినియోగదారులు బుక్ మార్క్ లు, హిస్టరీ, ఓపెన్ ట్యాబ్‌లు, సేవ్ చేసిన విషయాలను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సామ్ సంగ్ అకౌంట్ తో లాగిన్ అయిన తర్వాత, వినియోగదారులు సేఫ్ పాస్ వర్డ్ లను ఆటోఫిల్ చేసేకునే అవకాశం ఉంటుంది.
ఈ బ్రౌజర్ తో సామ్ సంగ్ తన అన్ని ప్లాట్ ఫారమ్ లలో ఒకే బ్రౌజింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించాలని టార్గెట్ గా పెట్టుకుంది. క్రాస్ డివైస్ సింక్ చేయడం వల్ల గెలాక్సీ వినియోగదారులు ఫోన్లతో పాటు పీసీలోనూ సేమ్ బ్రౌజింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక AI టూల్స్ వినియోగదారులకు మరింత మెరుగైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందించనుంది.
Read Also: ఆపిల్ ఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లు బెస్టా? అసలు విషయం చెప్పిన గూగుల్!