Shreyas Iyer: భారత క్రికెట్ అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది. సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై తాజా సమాచారం ఇచ్చింది బీసీసీఐ. గత కొద్ది రోజులుగా సిడ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్.. నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. అతడు గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపింది బీసీసీఐ. శ్రేయస్ అయ్యర్ ని సిడ్నీలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీసీసీఐ ధ్రువీకరించిందని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రేయస్ అయ్యర్.. నేడు నేరుగా ఇంటికి రాబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ తో ఆయన కుటుంబం కూడా ఉంది. బీసీసీఐ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలుపుతూ.. ” శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు స్థిరంగా ఉన్నాడు. బీసీసీఐ మెడికల్ టీం, భారత వైద్య నిపుణులు, సిడ్నీ ఆసుపత్రి వైద్యులు అతడు కోలుకునే విధానంపై సంతృప్తిగా ఉన్నారు. నేడు అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు” అని తెలిపింది.
ఇక శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రి బిల్ మొత్తం బీసీసీఐ చెల్లించింది. అయితే ఈ బిల్ బహిరంగంగా ప్రకటించబడదు. ఎందుకంటే కాంట్రాక్ట్ పొందిన భారతీయ ఆటగాళ్ల వైద్య ఖర్చులు అన్నింటినీ భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} భరిస్తుంది. భారతదేశం తరపున ఆడుతున్న సమయంలో తగిలే గాయాలకు చికిత్స, పునరావాసం మరియు ఏదైనా సంబంధిత చికిత్సతో సహా అన్ని ఖర్చులను బిసిసిఐ పాలసీ కవర్ చేస్తుంది. కానీ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రి బిల్లు దాదాపు 3 నుండి 5 కోట్ల వరకు అయ్యిందని సమాచారం. అలాగే స్పెషల్ డాక్టర్ ఆధ్వర్యంలో చికిత్స, సిడ్నీలో చికిత్స అయినందువల్ల ఎక్కువగా ఛార్జ్ అయిందని సమాచారం.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడవ వన్డేలో.. హర్షిత్ రాణా వేసిన బంతిని ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కారి అద్భుతమైన షాట్ ఆడాడు. అయితే బ్యాక్ వర్డ్ పాయింట్ లో నిలబడి ఉన్న శ్రేయస్ అయ్యర్. వేగంగా పరిగెత్తి ఆ బంతిని డైవింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఆ డైవింగ్ సమయంలో అతడి ఎడమ పక్కటెముకలకు తీవ్ర గాయం అయింది.
Also Read: Jemimah Rodrigues: జెమీమాకు నిరసన సెగ.. టీమిండియా నుంచి తొలగించాలని హిందూ సంఘాల డిమాండ్ ?
దీనివల్ల అయ్యర్ ప్లీహము పైన ఉన్న అవయవంలో అంతర్గత రక్తస్రావం జరిగింది. ఈ గాయం కారణంగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్కానింగ్ నివేదికలో అయ్యర్ ప్లీహంలో కొంత భాగం చీలిపోయినట్లు తేలింది. ఈ కారణంగా అతడు ఇంటర్వెన్షనల్ ట్రాన్స్ – కాథెటర్ ఏం బోలైజేషన్ చికిత్స చేయించుకున్నాడు. ఇక ప్రస్తుతం కోలుకున్న శ్రేయస్ అయ్యర్.. నేడు సిడ్నీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి భారత్ లోని తన నివాసానికి చేరుకోబోతున్నాడు.
🚨 𝑵𝑬𝑾𝑺 𝑨𝑳𝑬𝑹𝑻 🚨
Shreyas Iyer is now stable and recovering well, the BCCI has confirmed. 🙌🏼
He’s been discharged from the hospital in Sydney and will continue follow-up consultations there until he’s fit to fly home. 💪🏼#ShreyasIyer #Cricket #Sportskeeda pic.twitter.com/XvhiThBFPB
— Sportskeeda (@Sportskeeda) November 1, 2025